అపరిచిత లింకులు నొక్కొద్దు

‘ఫలానా కంపెనీ లాటరీలో మీరు కారు గెలుచుకున్నారు. సొంతం చేసుకోవాలంటే కింది వెబ్‌లింకును ఓపెన్‌ చేయండి.’ ‘ఫలానా కొరియర్‌ నుంచి మీకు ప్యాకేజీ వస్తోంది.’ స్మార్ట్‌ఫోన్‌కు ఇలాంటి రావటం మెసేజ్‌లు చూసే ఉంటారు. స్పామ్‌ కాల్సే కాదు,

Updated : 04 May 2022 05:53 IST

‘ఫలానా కంపెనీ లాటరీలో మీరు కారు గెలుచుకున్నారు. సొంతం చేసుకోవాలంటే కింది వెబ్‌లింకును ఓపెన్‌ చేయండి.’ ‘ఫలానా కొరియర్‌ నుంచి మీకు ప్యాకేజీ వస్తోంది.’ స్మార్ట్‌ఫోన్‌కు ఇలాంటి రావటం మెసేజ్‌లు చూసే ఉంటారు. స్పామ్‌ కాల్సే కాదు, ఇటీవల ఇలాంటి మోసపూరిత మెసేజ్‌లూ ఎక్కువయ్యాయి. వీటి వలలో పడి కొందరు డబ్బులు పోగొట్టుకుంటున్నారు కూడా. మరి స్పామ్‌ మెసేజ్‌లను గుర్తించటమెలా?

* అధీకృత వాణిజ్య సంస్థలు నాలుగు, ఐదు, ఆరు అంకెల నంబర్ల నుంచి మెసేజ్‌లు పంపుతుంటాయి. అదే స్పామ్‌ మెసేజ్‌లు సాధారణంగా 10, అంతకన్నా ఎక్కువ నంబర్లు గల ఫోన్ల నుంచి వస్తుంటాయి.

* స్పామ్‌ మెసేజ్‌లలో అక్షర దోషాలుంటాయి. పదాల అక్షరాల క్రమం మారిపోయి ఉంటుంది. స్పామ్‌ ఫిల్టర్ల నుంచి తప్పించుకోవటానికి ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తుంటారు.

* స్పామ్‌ సందేశాల వెబ్‌లింకులు చాలా విచిత్రంగా ఉంటాయి. మామూలుగా వెబ్‌సైట్ల లింకులు పేరుతో కలిసి (ఉదా: www.websitename.com) ఉంటాయి. కానీ స్పామ్‌ సందేశాల్లో వాక్యాలుగా కనిపిస్తుంటాయి. దీన్నే యూఆర్‌ఎల్‌ మాస్కింగ్‌ అంటారు. ఇలాంటి దారితప్పించే వెబ్‌లింక్‌ను నొక్కితే వేరే అడ్రస్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది.

అనుమానాస్పదంగా ఉంటే..

అనుమానాస్పద సందేశాల విషయంలో చేయాల్సిన మొదటి పని వెబ్‌లింకులను నొక్కకపోవటం. వీటికి రిప్లయి ఇవ్వటమూ తగదు. స్టాప్‌ అని మెసేజ్‌ పెట్టినా మన ఫోన్‌ యాక్టివ్‌గా ఉన్నట్టు అవతలివారికి తెలిసిపోతుంది. ఒకవేళ స్పామ్‌ మెసేజ్‌లు అదేపనిగా వస్తుంటే స్పామ్‌ ఫిల్టరింగ్‌ యాప్స్‌ను వాడుకోవచ్చు. తెలియని వారి నుంచి వచ్చే మెసేజ్‌లను బ్లాక్‌ చేయటానికి కొన్ని ఫోన్లలో ఆప్షన్‌ కూడా ఉంటుంది. కావాలంటే వీటిని ఎనేబుల్‌ చేసుకోవచ్చు. అపరిచితులకు ఫోన్‌ నంబరును షేర్‌ చేయకుండా చూసుకోవటం ద్వారానూ స్పామ్‌ మెసేజ్‌ల బెడద తప్పించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని