యూట్యూబ్‌లో మోస్ట్‌ రీప్లేడ్‌ ఫీచర్‌

యూట్యూబ్‌లో ఏదో వీడియో చూస్తుంటాం. మధ్యలో కొన్నిసార్లు బోర్‌ కొట్టొచ్చు. అయినా తర్వాత ఏమవుతుందోననే ఆసక్తితో చూస్తూనే ఉంటాం. మున్ముందు ఆసక్తి కలిగిస్తుందో లేదో తెలిసేదెలా? ఉత్సుకత కలిగించే అంశాలుంటే వీక్షకులు మళ్లీ మళ్లీ చూస్తుంటారు కదా.

Published : 25 May 2022 01:09 IST

యూట్యూబ్‌లో ఏదో వీడియో చూస్తుంటాం. మధ్యలో కొన్నిసార్లు బోర్‌ కొట్టొచ్చు. అయినా తర్వాత ఏమవుతుందోననే ఆసక్తితో చూస్తూనే ఉంటాం. మున్ముందు ఆసక్తి కలిగిస్తుందో లేదో తెలిసేదెలా? ఉత్సుకత కలిగించే అంశాలుంటే వీక్షకులు మళ్లీ మళ్లీ చూస్తుంటారు కదా. దీన్ని తెలుసుకోవటానికే యూట్యూబ్‌ ‘మోస్ట్‌ రీప్లేడ్‌’ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది గ్రాఫ్‌ రూపంలో ప్రొగ్రెస్‌ బార్‌ వెనకాల కనిపిస్తుంది. దీంతో వీడియోలో చాలామందికి నచ్చిన భాగాలు ఉన్నట్టయితే వెంటనే గుర్తించొచ్చు. గ్రాఫ్‌ ఎత్తుగా ఉంటే ఆ భాగాన్ని తరచూ రీప్లే చేశారని అర్థం. ఈ గ్రాఫ్‌ ద్వారా ఆ భాగాన్ని వెంటనే వెతికి, చూసుకోవచ్చు. యూట్యూబ్‌ ప్రీమియం వినియోగదారులకు ప్రయోగాత్మకంగా ఆరంభించిన ‘మోస్ట్‌ రీప్లేడ్‌’ ఆప్షన్‌ను ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని