ఫొటోషాప్‌ ఉచితంగా!

ఫొటో ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది అడోబ్‌ ఫొటోషాప్‌. ఇది అంతగా ప్రాచుర్యం పొందింది మరి. ప్రపంచవ్యాప్తంగా సృజనాత్మక కళాకారుల్లో 90 శాతం మంది దీన్నే వాడుతుంటారు. కాకపోతే ఫొటోషాప్‌ సాఫ్ట్‌వేర్‌ను కొనుక్కుంటే తప్ప

Updated : 22 Jun 2022 00:19 IST

ఫొటో ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది అడోబ్‌ ఫొటోషాప్‌. ఇది అంతగా ప్రాచుర్యం పొందింది మరి. ప్రపంచవ్యాప్తంగా సృజనాత్మక కళాకారుల్లో 90 శాతం మంది దీన్నే వాడుతుంటారు. కాకపోతే ఫొటోషాప్‌ సాఫ్ట్‌వేర్‌ను కొనుక్కుంటే తప్ప వాడుకోలేం. ఇకపై అలా నిరాశ పడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. త్వరలోనే ఇది ఉచితంగా అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం అడోబ్‌ సంస్థ వెబ్‌ వర్షన్‌ను తీసుకురానుంది. ఇప్పటికే దీన్ని కెనడాలో పరీక్షించినట్టు తెలుస్తోంది. ఫొటోషాప్‌ను మరింత ఎక్కువ మందికి పరిచయం చేయటం దీని ఉద్దేశం. ఉచిత ఖాతా ద్వారా వాడుకోవటానికి వీలుండే అవకాశాన్ని అడోబ్‌ సంస్థ ‘ఫ్రీమియం’గా పేర్కొంటోంది. అంటే కొన్ని ఫీచర్లు చందాదారులకు ప్రత్యేకించి ఉంటాయన్నమాట. అయితే ఫొటోషాప్‌ కీలక ఫీచర్లును వాడుకోవటానికి అవసరమైన టూల్స్‌ అన్నీ ఉచితంగానే అందుబాటులో ఉంటాయి. వెబ్‌వర్షన్‌ కావటం వల్ల ఏ పరికరం నుంచైనా,    ఎవరైనా ఫొటోషాప్‌ను వాడుకోవచ్చు. అడోబ్‌ గత సంవత్సరంలో చందాదారుల కోసం ఫొటోషాప్‌ వెబ్‌వర్షన్‌ను ప్రారంభించింది. దీన్ని బీటా రూపంలో పరిచయం చేసింది. ఇప్పుడు మరింత విస్తృతం చేస్తూ ఉచిత వెబ్‌వర్షన్‌ను అందుబాటులోకి తెస్తుండటం ఉత్సుకత కలిగిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని