ఇన్‌స్టా అవతార్‌!

స్నాప్‌ఛాట్‌లో బిట్‌మోజీ అవతార్లను చూసే ఉంటారు. ప్రస్తుతం ఫేస్‌బుక్‌, మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ కోసమూ మెటా అలాంటి 3డీ అవతార్లను ప్రవేశపెట్టింది. ఇది మన ఆకారానికి తగినట్టుగా అవతార్‌ను సృష్టించుకోవటానికి తోడ్పడుతుంది. మనకు

Published : 22 Jun 2022 00:23 IST

స్నాప్‌ఛాట్‌లో బిట్‌మోజీ అవతార్లను చూసే ఉంటారు. ప్రస్తుతం ఫేస్‌బుక్‌, మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ కోసమూ మెటా అలాంటి 3డీ అవతార్లను ప్రవేశపెట్టింది. ఇది మన ఆకారానికి తగినట్టుగా అవతార్‌ను సృష్టించుకోవటానికి తోడ్పడుతుంది. మనకు ఇష్టమైనట్టుగా జుట్టు, చర్మం రంగు, కళ్లు, దుస్తులు, ఆభరణాలతో కూడిన ఆకారాలను రూపొందించుకోవచ్చు. వీటిని అకౌంట్స్‌ సెంటర్‌లోనూ సింక్‌ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌, మెసెంజర్‌ దగ్గర్నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ వరకూ అన్ని యాప్‌లలోనూ ఉపయోగించుకోవచ్చు. మరి ఇన్‌స్టాగ్రామ్‌లో అవతార్‌ను ఎలా సృష్టించుకోవాలో తెలుసా?

ముందుగా కుడివైపు అడుగున ఉండే ప్రొఫైల్‌ పిక్చర్‌ మీద ట్యాప్‌ చేసి ప్రొఫైల్‌లోకి వెళ్లాలి.

‘ఎడిట్‌ ప్రొఫైల్‌’ మీద ట్యాప్‌ చేసి, ‘సెటింగ్స్‌’ ఎంచుకోవాలి.

అకౌంట్స్‌ సెటింగ్‌లో ‘క్రియేట్‌ అవతార్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీన్ని ట్యాప్‌ చేయాలి.

ఇందులో అవతార్‌ చర్మం రంగు, వెంట్రుకలు, ముఖం, కళ్లు, కనుబొమలు, ముక్కు, నోరు వంటి వాటిని ఎంచుకోవాలి. అవతార్‌ను సృష్టిస్తున్నప్పుడు కెమెరాతో మనల్ని కూడా చూసుకోవచ్చు.

అవతార్‌ను ఇష్టమైనట్టుగా తీర్చిదిద్దుకున్నాక ‘డన్‌’ బటన్‌ను నొక్కాలి. ‘సేవ్‌ ఛేంజెస్‌’ ఎంచుకుంటే సరి.

ఒకవేళ అవతార్‌ రూపం నచ్చలేదనుకోండి. ఎడిట్‌ ప్రొఫైల్‌ ద్వారా ఎప్పుడైనా కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని