యూట్యూబ్‌ సెర్చ్‌ తేలికగా

యూట్యూబ్‌లో కోట్లాది వీడియోలు. ప్రతి నిమిషానికి 500 గంటల కంటెంట్‌ పోస్ట్‌ అవుతుందని అంచనా. ఇందులో మనకు కచ్చితంగా కావాల్సిందేంటో వెతకటానికి చాలా సమయమే పడుతుంది.

Updated : 29 Jun 2022 03:52 IST

యూట్యూబ్‌లో కోట్లాది వీడియోలు. ప్రతి నిమిషానికి 500 గంటల కంటెంట్‌ పోస్ట్‌ అవుతుందని అంచనా. ఇందులో మనకు కచ్చితంగా కావాల్సిందేంటో వెతకటానికి చాలా సమయమే పడుతుంది. పాత వీడియోలెన్నో కనిపించొచ్చు. కొన్నిసార్లు ఇది చిరాకు కలిగించొచ్చు. కొన్ని చిట్కాలతో ఇలాంటి ఇబ్బందిని తప్పించుకోవచ్చు.

* సెర్చ్‌ బాక్స్‌లో అవసరమైన అంశాన్ని టైప్‌ చేశాక వారం లేదా నెల కూడా ఎంటర్‌ చేస్తే ఆ కాలానికి సంబంధించిన వీడియోలే కనిపిస్తాయి. ఉదాహరణకు: dhoni news this week అని టైప్‌ చేస్తే ఆ వారంలో పోస్ట్‌ అయిన వీడియోలే  ప్రత్యక్షమవుతాయి.

* ఫిల్టర్‌ ఆప్షన్‌ సాయమూ తీసుకోవచ్చు. అంశాన్ని సెర్చ్‌ చేశాక మొదటి వీడియో పైన కనిపించే ఫిల్టర్‌ ఆప్షన్‌ను నొక్కాలి. ఇందులో గంట క్రితం దగ్గర్నుంచి గత సంవత్సరం వరకూ.. వీడియోలు అప్‌లోడ్‌ అయిన తేదీల వారీగా వివిధ విభాగాల్లో కనిపిస్తాయి. దీని ప్రకారం వీడియోలను సెర్చ్‌ చేసుకోవచ్చు. మొబైల్‌ ఫోన్‌లో నైతే సెర్చ్‌ బార్‌ పక్కన నిలువు చుక్కల మెనూతో ఫిల్టర్‌ను ఎంచుకోవచ్చు.

* యూట్యూబ్‌లో బోలెడన్ని భాషల పాటల వీడియోలు. పేరడీలు, ఫ్యాన్ల వీడియోలు ఎన్నో ఉంటాయి. మరి అసలు వీడియోను చూడాలంటే? పాట పేరు పక్కన కామా గుర్తు పెట్టి పాడినవారి పేరు టైప్‌ చేయాలి. దీంతో వారి పాటలే కనిపిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని