సఫారీ మీద సవారీ
యాపిల్ పరికరాలు వాడేవారికి ‘సఫారీ’ వెబ్ బ్రౌజర్ సుపరిచితమే. అయినా చాలామంది గూగుల్ క్రోమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటుంటారు. సఫారీ అంత సమర్థమైంది కాదని అనుకోవటమే దీనికి కారణం. నిజానికి క్రోమ్‌లో లేని ఎన్నో ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి తెలిస్తే ఔరా అనాల్సిందే.
ఫొటోలోంచి టెక్స్ట్ కాపీ
మెమేల దగ్గర్నుంచి స్క్రీన్ షాట్ల వరకూ చాలా ఇమేజ్ ఫైళ్లలో టెక్స్ట్ చదువుతుంటాం. కొన్నిసార్లు ఇవి బాగా ఆకర్షిస్తుంటాయి. కానీ ఫొటో నుంచి అక్షరాలను కాపీ చేసి, మరోచోట పేస్ట్ చేయటం సాధ్యం కాదు. ఇది చాలా చికాకు తెప్పిస్తుంది. కానీ సఫారీలోనైతే దీన్ని తేలికగా చేసేయొచ్చు. ఇందులో మ్యాక్‌ఓఎస్ ఫీచర్ ‘లైవ్ టెక్స్ట్’ ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. ఇది ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ద్వారా ఫొటోల్లోని టెక్స్ట్‌ను గుర్తిస్తుంది. దీంతో టెక్స్ట్‌ను ఇట్టే కాపీ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను వాడుకోవాలంటే సఫారీలో ఫొటోను ఓపెన్ చేస్తే చాలు. అందులో కనిపించే టెక్స్ట్‌ను కాపీ చేసుకుంటే సరి. ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు.
మరింత భద్రత
సఫారీలో మరో ప్రత్యేకత ఇంటెలిజెంట్ ట్రాకింగ్ ప్రివెన్షన్ వ్యవస్థ. ఇది థర్డ్ పార్టీ కుకీలను ఆపేస్తుంది. అంటే ఇతర వెబ్‌సైట్లలో మనమేం చూస్తున్నామో, చదువుతున్నామో అమెజాన్ వంటి కంపెనీలకు తెలియదన్నమాట. లైక్, షేర్ బటన్ల వంటి వాటిని మనం వాడకపోయినా కొన్ని వెబ్‌సైట్లు వీటి ద్వారా ట్రాక్ చేస్తుంటాయి. సఫారీ దీన్ని తనకు తానే నిలువరిస్తుంది. దీంతో వ్యక్తిగత సమాచారం మరింత భద్రంగా ఉంటుంది. యాడ్-ఆన్స్‌తో క్రోమ్‌లోనూ ఇలాంటి సదుపాయాలు ఉంటాయి గానీ సఫారీలో ఇవి డిఫాల్ట్‌గానే ఎనేబులై ఉంటాయి.
ఆటోప్లే కంట్రోల్
వాటంతటవే ప్లే అయ్యే వీడియోలను క్రోమ్‌లో సెట్ చేసుకోవటం కాస్త కష్టమైన పనే. కానీ సఫారీలో ఇది చాలా తేలిక. ‘ప్రిఫరెన్స్’లోకి వెళ్లి, ‘వెబ్‌సైట్స్’ ట్యాబ్‌ను ఓపెన్ చేస్తే ‘ఆటో-ప్లే’ విభాగం కనిపిస్తుంది. ఇందులో ‘నెవర్ ఆటో-ప్లే’ ఎంచుకుంటే చాలు. అప్పటికి ఓపెన్ అయి ఉన్న సైట్లకు వర్తించకుండానూ దీన్ని కన్ఫిగర్ చేసుకోవచ్చు.
నేరుగా రీడర్ మోడ్
వెబ్‌సైట్‌ను రీడర్‌మోడ్‌లో పెట్టుకుంటే చదవటానికి హాయిగా ఉంటుంది. రీడర్ మోడ్‌లో సైడ్‌బార్లు, పాపప్స్, ప్రకటనల వంటి చికాకు పరచేవేవీ ఉండవు. క్రోమ్‌లో ఇలాంటి సదుపాయం ఉంది గానీ ఎక్స్‌పెరిమెంటల్ సెటింగ్స్ లేదా ఫ్లాగ్స్ ద్వారానే వాడుకోవటానికి వీలుంటుంది. అదే సఫారీలోనైతే సెటింగ్స్ ద్వారానే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇది తేలికగా రీడర్ మోడ్‌లోకి మార్చటమే కాదు, వెబ్‌సైట్‌లో ఏ కథనాన్ని అయినా డిఫాల్ట్‌గా రీడర్ మోడ్‌లో ఓపెన్ అయ్యేలా చేస్తుంది కూడా. దీన్ని వాడుకోవాలనుకుంటే- వ్యూ విభాగంలోకి వెళ్లి, ‘షో రీడర్’ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అడ్రస్ బార్ మీద ఎడమ వైపున పేజీ మాదిరిగా కనిపించే ‘రీడర్’ గుర్తు మీద క్లిక్ చేసినా చాలు.
పరికరం మారినా
మ్యాక్‌లో ఏదో వెబ్‌సైట్ చూస్తున్నారు. దాన్ని అదే సమయంలో ఐఫోన్‌లో లేదా ఐప్యాడ్‌లో చూసుకోవటానికీ వీలుంటుంది. ఇందుకు ‘కంటిన్యూటీ’ ఫీచర్ తోడ్పడుతుంది. క్రోమ్‌లోనూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే సఫారీలో మరిన్ని ఎక్కువ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు- కొత్త ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు ప్రస్తుతం ఓపెన్ అయి ఉన్న ట్యాబ్‌ల జాబితా ఇతర పరికరాల్లోనూ కనిపిస్తుంది. బుక్‌మార్క్‌లు, చదువుతున్న పేజీలు వాటంతటవే సింక్ అవుతాయి.
డబ్బుల చెల్లింపు
యాపిల్ పేమెంట్ వ్యవస్థ ఒక్క ఐఫోన్‌కే పరిమితం కాదు. టచ్‌ఐడీ ద్వారా క్రెడిట్ కార్డు వివరాలను ధ్రువీకరించుకుంటే సఫారీలోనూ దీన్ని వాడుకోవచ్చు. ఇతర పరికరాల్లో ఈ వ్యవస్థను ఉపయోగించు కోవటానికి ఇప్పుడు ఆన్‌లైన్ అంగళ్లు బాగానే సపోర్టు చేస్తున్నాయి.
బ్యాటరీ మన్నిక
క్రోమ్ కన్నా సఫారీ తక్కువ ర్యామ్, సీపీయూను వాడుకుంటుంది. అందువల్ల బ్యాటరీ త్వరగా నిండుకోదు. దీంతో ల్యాప్‌టాప్, ఐఫోన్, ఐప్యాడ్ వంటి వాటిని ఎక్కువ సేపు వాడుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News : కలిసుంటానని చెప్పి.. కోర్టు ఆవరణలోనే భార్య గొంతు కోసి..
-
Sports News
Sachin Tendulkar: సచిన్ తొలి సెంచరీ రుచి చూసిన వేళ..!
-
Movies News
Balakrishna: నందమూరి వంశానికే ఆ ఘనత దక్కుతుంది: బాలకృష్ణ
-
Crime News
Hyderabad News: నైనా జైస్వాల్‌పై అసభ్య కామెంట్లు.. యువకుడి అరెస్ట్
-
World News
Salman Rushdie: మాట్లాడుతున్న రష్దీ.. వెంటిలేటర్ తొలగించిన వైద్యులు!
-
Technology News
Google Password Manager: హోమ్ స్క్రీన్‌లో గూగుల్ పాస్వర్డ్ మేనేజర్.. ఇక ఆ చింతక్కర్లేదు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం
- Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
- MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- Ross Taylor : ఆ మ్యాచ్‌లో డకౌట్.. రాజస్థాన్ ఫ్రాంచైజీ ఓనర్ నా మొహంపై కొట్టాడు: టేలర్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)
- బంగారం ధర నిర్ణయించే శక్తిగా భారత్?