యాప్స్‌ ఇన్‌స్టాల్‌ కాకపోతే?

ఆండ్రాయిడ్‌ పరికరాల్లో యాప్స్‌ డౌన్‌లోడ్‌ అయినా ఇన్‌స్టాల్‌ కావటం లేదా? ఎర్రర్‌ మెసేజ్‌ వస్తోందా? ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేస్తుండొచ్చు. వీటిని సరిచేసుకోవటమెలా?

Updated : 06 Jul 2022 11:27 IST

ఆండ్రాయిడ్‌ పరికరాల్లో యాప్స్‌ డౌన్‌లోడ్‌ అయినా ఇన్‌స్టాల్‌ కావటం లేదా? ఎర్రర్‌ మెసేజ్‌ వస్తోందా? ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేస్తుండొచ్చు. వీటిని సరిచేసుకోవటమెలా?
* ఏదైనా పెద్ద యాప్‌ లేదా గేమ్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవటానికి ముందు ఫోన్‌లో ఎంత ఫ్రీ స్టోరేజీ ఉందో చూసుకోవాలి. ఇంటర్నల్‌ మెమరీ తక్కువగా ఉంటే ఇన్‌స్టలేషన్‌ ఎర్రర్‌ చూపిస్తుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో యాప్‌ను సెర్చ్‌ చేసినప్పుడు దాని ఇన్ఫోలోకి వెళ్తే ఎంత స్టోరేజీ అవసరమవుతుందో తెలిసిపోతుంది. ఫోన్‌ స్టోరేజీలోకి వెళ్లి చూసుకుంటే ఎంత ఖాళీ ఉందో చూసుకోవాలి. ఒకవేళ తక్కువ స్టోరేజీ ఉంటే అనవసరమైన పెద్ద ఫైళ్లను డిలిట్‌ చేసేయాలి.
* ఇంటర్నెట్‌ కనెక్షన్‌ సరిగా లేకపోయినా ఇబ్బందులు తలెత్తొచ్చు. వై-ఫై కనెక్షన్‌ స్లోగా ఉంటే యాప్‌ సరిగా డౌన్‌లోడ్‌ కాకపోవచ్చు. ఇది ఇన్‌స్టాల్‌ ప్రక్రియను దెబ్బతీస్తుంది. ఇప్పుడు నెట్‌ వేగం ఎంతుందో తెలుసుకోవటానికి చాలా వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో వేగాన్ని చూసుకోవచ్చు.
* కొన్నిసార్లు గూగుల్‌ ప్లే స్టోర్‌ సరిగా పనిచేయకపోవచ్చు. అప్పుడు ఆ యాప్‌ను ఫోర్స్‌ స్టాప్‌ చేసి, తిరిగి ప్రయత్నిస్తే ఫలితం కనిపిస్తుంది. హోంస్క్రీన్‌ మీద గూగుల్‌ ప్లే స్టోర్‌ గుర్తు మీద నొక్కి పడితే ‘యాప్‌ ఇన్ఫో’ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఇందులోకి వెళ్లి ‘ఫోర్స్‌ స్టాప్‌’ను ఎంచుకుంటే పనిచేయటం ఆగిపోతుంది.
* ప్లేస్టోర్‌లో తాజా అప్‌డేట్‌తోనూ అప్పుడప్పుడు ఇబ్బంది కలగొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్లేస్టోర్‌ యాప్‌ ఇన్ఫోలోని ‘అన్‌ఇన్‌స్టాల్‌ అప్‌డేట్స్‌’ ఆప్షన్‌ ద్వారా అప్‌డేట్స్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. తర్వాత ఇన్‌స్టాల్‌ చేసుకోవాలనుకునే యాప్‌ను తిరిగి ప్రయత్నించొచ్చు.
* తాత్కాలికంగా ప్లేస్టోర్‌ను డిసేబుల్‌ చేసి, ఎనేబుల్‌ చేసుకోవటం ద్వారానూ కొన్నిసార్లు సమస్య తొలగిపోవచ్చు. ప్లేస్టోర్‌ యాప్‌ ఇన్ఫోలోనే ఈ ఫీచర్‌ కూడా ఉంటుంది.
* మనం సెర్చ్‌ చేసే వాటిని గుర్తుంచుకోవటానికి ప్లేస్టోర్‌ క్యాచీ ఫైళ్లను సేకరించి పెట్టుకుంటుంది. తప్పుడు క్యాచీ ఫైలును సేకరించి ఉన్నట్టయితే ఇన్‌స్టలేషన్‌ ఎర్రర్‌ మెసేజ్‌ రావొచ్చు. కాబట్టి అప్పుడప్పుడు యాప్‌ క్యాచీని క్లియర్‌ చేసుకోవటం మంచిది. ప్లేస్టోర్‌ ఇన్ఫో మెనూ ద్వారా స్టోరేజీలోకి వెళ్తే క్యాచీ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీని ద్వారా క్యాచీని క్లియర్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత యాప్స్‌ నెమ్మదిగా డౌన్‌లోడ్‌ అవుతుండొచ్చు గానీ ఇన్‌స్టలేషన్‌ ప్రక్రియ సజావుగా సాగుతుంది.
పరికరం కంపాటబిలిటీని బట్టి కొన్ని యాప్స్‌ ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌ మీద పనిచేయవు. లొకేషన్‌ షరతుల కారణంగా కొన్ని డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి ఆయా యాప్స్‌ మన పరికరాలకు అందుబాటులో ఉన్నాయో, లేదో ముందే చూసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని