Updated : 13 Jul 2022 00:27 IST

గూగుల్‌ అసిస్టెంట్‌ టర్న్‌ ఆఫ్‌ ఎలా?

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గూగుల్‌ అసిస్టెంట్‌ సదుపాయం గురించి తెలిసిందే. దీని ద్వారా మాటలతోనే ఫోన్‌తో కాల్‌ చేయటం దగ్గర్నుంచి యూట్యూబ్‌లో వీడియోలు వెతకటం వరకూ ఎన్నో పనులు చేయించుకోవచ్చు. ఇందులో సందేహమేమీ లేదు. అయితే కొన్నిసార్లు ఇది చిక్కులకూ దారితీయొచ్చు. పక్కవాళ్లతో మాట్లాడుతున్నప్పుడు వాటిని గ్రహించి అనవసరంగా గూగుల్‌ అసిస్టెంట్‌ పాపప్‌ కావచ్చు. టీవీలో వచ్చే మాటలకో, ప్రకటనలకో స్పందించొచ్చు. గూగుల్‌ అసిస్టెంట్‌ను టర్న్‌ ఆఫ్‌ చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులను తప్పించుకోవచ్చు. మరి దీన్ని ఆపేయటమెలా?

* ముందుగా ఫోన్‌లో లేదా ట్యాబ్లెట్‌లో గూగుల్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. పైన కుడివైపున కనిపించే ప్రొఫైల్‌ గుర్తు మీద క్లిక్‌ చేసి, సెటింగ్స్‌ను ఎంచుకోవాలి. ఒకవేళ అక్కడ సెటింగ్స్‌ ఆప్షన్‌ కనిపించనట్టయితే తెరకు ఒక మూలన కనిపించే మూడు చుక్కలతో కూడిన మోర్‌ బటన్‌ను నొక్కి, సెటింగ్స్‌ను ఎంచుకోవాలి. సెటింగ్స్‌ తెర ఓపెన్‌ అయ్యాక ‘గూగుల్‌ అసిస్టెంట్‌’ ఆప్షన్‌ మీద ట్యాప్‌ చేయాలి.

* కొన్ని ఆండ్రాయిడ్‌ ఫోన్లలో నేరుగా ‘డిసేబల్‌ గూగుల్‌ అసిస్టెంట్‌’ ఫీచర్‌ కనిపిస్తుంది. ఈ స్విచ్‌ను ఆఫ్‌ చేస్తే తేలికగా డిసేబుల్‌ అయిపోతుంది.

* ఫోన్‌లో ‘డిసేబుల్‌ గూగుల్‌ అసిస్టెంట్‌’ ఫీచర్‌ లేనట్టయితే అలాగే కిందికి వెళ్లి ‘అసిస్టెంట్‌ డివైసెస్‌’ను (కొన్ని ఫోన్లలో డివైస్‌) స్వైప్‌ చేయాలి. ఇందులో ‘ఫోన్‌’ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి.

* ఒకవేళ ‘డిసేబుల్‌ గూగుల్‌ అసిస్టెంట్‌’.. అసిస్టెంట్‌ డివైసెస్‌, డివైస్‌ ఆప్షన్లతో టర్న్‌ ఆఫ్‌ చేసుకునే సదుపాయం లేకపోతే.. సెటింగ్స్‌లో అలాగే కిందికి వెళ్లి గేర్‌ గుర్తుతో కనిపించే ‘జనరల్‌’ మీద ట్యాప్‌ చేయాలి. ఇందులో గూగుల్‌ అసిస్టెంట్‌ మీద తాకితే టర్న్‌ ఆఫ్‌ సదుపాయం కనిపిస్తుంది. దీన్ని ఎంచుకుంటే పనిచేయటం ఆగిపోతుంది.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts