Updated : 20 Jul 2022 03:03 IST

డ్రైవ్‌లో డిలీట్‌ అయిన ఫైళ్ల రిస్టోర్‌ ఎలా?

ఫొటోలు, పీడీఎఫ్‌లు, వీడియోలు.. ఎలాంటి ఫైళ్లనైనా సేవ్‌ చేసుకొని, ఆన్‌లైన్‌లో చూసుకోవటానికి గూగుల్‌ డ్రైవ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. క్లౌడ్‌ స్టోరేజ్‌ సేవలను ఉచితంగానే అందించటం వల్ల ఎంతోమంది దీన్ని వాడుకుంటూ ఉంటారు. ఇది మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లు, పీసీల వంటి వివిధ పరికరాలను సింక్‌ చేసేస్తుంది. కేవలం స్టోర్‌ చేసుకోవటమే కాదు ఇందులో ఫైళ్లను ఎడిట్‌ చేసుకోవచ్చు కూడా. అయితే కొన్నిసార్లు పొరపాటున ఫైల్‌ను డిలిట్‌ చేయొచ్చు. అప్పుడెలా? కంగారు పడాల్సిన పనేమీ లేదు. డిలిట్‌ అయిన ఫైళ్లను 30 రోజుల్లో ఎప్పుడైనా రిస్టోర్‌ చేసుకోవచ్చు.

కంప్యూటర్‌లోనైతే..

* ముందుగా గూగుల్‌ డ్రైవ్‌ ట్రాష్‌లోకి వెళ్లాలి.

* తిరిగి పొందాలని అనుకుంటున్న ఫైలు మీద రైట్‌ క్లిక్‌ చేయాలి.

* రిస్టోర్‌ బటన్‌ మీద నొక్కితే తిరిగి యథాస్థానంలోకి వచ్చి చేరుతుంది.

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోనైతే..

* గూగుల్‌ డ్రైవ్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.

* పైన ఎడమవైపున కనిపించే మూడు గీతల మీద తాకి, ట్రాష్‌లోకి వెళ్లాలి.

* ఫైలు పక్కన ఉండే నిలువు మూడు చుక్కలను నొక్కి, రిస్టోర్‌ చేసుకోవాలి.

ఐఫోన్‌లోనైతే..

* ఐఓఎస్‌ పరికరంలో గూగుల్‌ డ్రైవ్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.

* పైన ఎడమవైపు మూలకు కనిపించే మూడు గీతల మీద నొక్కాలి.

* తర్వాత బిన్‌/ట్రాష్‌ ఎంచుకోవాలి.

* రిస్టోర్‌ చేయాలనుకునే ఫైలు పక్కన మూడు నిలువు గీతలను నొక్కాలి.

* రిస్టోర్‌ బటన్‌ మీద నొక్కితే సరి.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts