- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
సురక్షితంగా వెబ్ విహారం!
వెబ్ విహారం నిత్యకృత్యమైంది. బ్యాంకు వ్యవహారాలు, వస్తువుల కొనుగోలు వంటివన్నీ ఆన్లైన్లోనే కానిచ్చేస్తున్నాం. కొన్నిసార్లు పాస్వర్డ్లు, చిరునామాలు, క్రెడిట్ కార్డు వివరాల వంటివి మాటిమాటికీ టైప్ చేయాల్సి రావొచ్చు. అప్పుడప్పుడిది చిరాకు తెప్పించొచ్చు. పాస్వర్డ్ మరచిపోతే ఎక్కడ రాసిపెట్టుకున్నామో వెతుక్కోవాల్సి వస్తుంది. లేదూ కొత్తది సృష్టించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందిని తప్పించటానికి చాలా బ్రౌజర్లు ఆటోకంప్లీట్ ఫీచర్ సదుపాయం కల్పిస్తున్నాయి. ఇది పాస్‌వర్డ్‌ల వంటి వాటిని తొలిసారి టైప్ చేసినప్పుడు సేవ్ చేసుకుంటుంది. అవసరమైనప్పుడు దానంతటదే నింపేస్తుంది. ఇది బాగానే ఉపయోగపడినప్పటికీ గోప్యత, ఆన్లైన్ భద్రత విషయంలోనే ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే మనమే కాదు, కంప్యూటర్ ముందు ఎవరు కూర్చున్నా ఆయా వివరాలు ఆటోఫిల్ అవుతాయి. చిరునామా, పాస్‌వర్డ్‌ల వంటి రహస్య సమాచారం మోసగాళ్ల చేతికి చిక్కితే చిక్కుల్లో పడక తప్పదు. కాబట్టి బ్రౌజర్ ఎలాంటి సమాచారాన్ని దాచిపెట్టుకుంటోంది? దాన్ని ఎలా చూసుకోవాలి? ఎలా మార్చుకోవాలి? అనేవి తెలుసుకొని, జాగ్రత్తగా ఉండాలి.
గూగుల్ క్రోమ్‌లో
బ్రౌజర్‌ను ఓపెన్ చేసి, పైన కుడివైపు మూలకు కనిపించే నిలువు మూడు చుక్కల మీద క్లిక్ చేయాలి. దీని ద్వారా సెటింగ్స్‌లోకి వెళ్లి, ఎడమవైపు జాబితాలో ఆటోఫిల్ విభాగాన్ని నొక్కితే బ్రౌజర్లో స్టోర్ అయిన సమాచారమంతా కనిపిస్తుంది. పాస్వర్డ్స్ విభాగాన్ని ఎంచుకుంటే సేవ్ అయిన లాగిన్ వివరాలను చూడొచ్చు. కావాలంటే సెర్చ్ బాక్స్ ద్వారానూ వెతుక్కోవచ్చు. పాస్‌వర్డ్‌లను బ్రౌజర్ గుర్తుంచుకోకుండా, ఆయా సైట్లలో ఆటోమేటిక్‌గా లాగిన్ కాకుండా బటన్లను మార్చుకోవచ్చు. పేమెంట్ మెథడ్స్ విభాగంలోకి వెళ్తే క్రోమ్ బ్రౌజర్ సేవ్ చేసి పెట్టుకున్న డెబిట్, క్రెడిట్ కార్డు సమాచారం కనిపిస్తుంది. వద్దనుకుంటే ఈ ఆప్షన్‌నూ మార్చుకోవచ్చు. ఇక అడ్రసెస్ అండ్ మోర్ విభాగంలోకి వెళ్తే ఇంటి చిరునామా, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ల వంటి వాటికి సబంధించిన సమాచారాన్ని చూడొచ్చు. ఆయా వివరాల పక్కన మూడు చుక్కల మీద క్లిక్ చేసి ఎడిట్ లేదా రిమూవ్ చేసుకోవచ్చు. అసలు క్రోమ్ ఎలాంటి సమాచారాన్నీ దాచుకోవద్దని భావిస్తే ‘సేవ్ అండ్ ఫిల్ అడ్రసెస్’ ఆప్షన్‌ను స్విఛాఫ్ చేసుకోవటం మంచిది.
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో
క్రోమ్, ఎడ్జ్ రెండూ క్రోమియం కోడ్ మీదే పనిచేస్తాయి. అందుకే రెండూ ఒకేలా కనిపిస్తుంటాయి. కానీ ఎడ్జ్‌లో కొన్ని ప్రత్యేక సదుపాయాలు లేకపోలేదు. ఇందులో వ్యక్తిగత సమాచారాన్ని చూడాలంటే పైన కుడివైపున కనిపించే మూడు చుక్కల మీద క్లిక్ చేసి, ప్రొఫైల్‌ను ఎంచుకోవాలి. సింక్ ద్వారా ఎడ్జ్‌ను ఇన్స్టాల్ చేసుకున్న ఏయే పరికరాలు అనుసంధానమై ఉన్నాయేమో తెలుస్తుంది. ప్రొఫైల్‌లోని ‘పర్సనల్ ఇన్ఫో’ విభాగంలో సేవ్ అయిన పోస్టల్, ఈమెయిల్ చిరునామాలు.. ఫోన్, పాస్‌పోర్టు నంబర్ల వంటివి కనిపిస్తాయి. ఈ సమాచారం స్టోర్ కావొద్దని అనుకుంటే ఆయా అంశాల పక్కన మూడు చుక్కల మీద నొక్కి ఎడిట్ లేదా డిలీట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్స్ విభాగంలోకి వెళ్తే బ్రౌజర్ దాచుకున్నవి కనిపిస్తాయి. వద్దనుకుంటే తేలికగా మార్చుకోవచ్చు. ఎడ్జ్ ఆయా పాస్వర్డులు ఎంత బలంగా ఉన్నాయో కూడా రేటింగ్ ఇస్తుంది. వాటిని ఆటోమేటిక్‌గా ఫిల్ చేయాలో వద్దో నిర్ణయించుకునే అవకాశమూ కల్పిస్తుంది. పేమెంట్ ఇన్ఫో విభాగం ద్వారా సేవ్ అయిన కార్డుల వివరాలు చూసుకోవచ్చు. ఇష్టం లేకపోతే వీటి వివరాలను రికార్డు చేసుకోవటాన్ని ఆపేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌తో సైన్ అయ్యింటే దాంతో ముడిపడిన పేమెంట్ సమాచారమూ ఇందులో కనిపిస్తుంది.
సఫారీలో
సఫారీ బ్రౌజర్‌ను వాడుతున్నట్టయితే మెనూను ఓపెన్ చేయాలి. ఇందులోని ప్రిఫరెన్సెస్ ద్వారా ఆటోఫిల్ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ బ్రౌజర్ సేవ్ చేసి పెట్టుకున్న సమాచారమంతా కనిపిస్తుంది. ఏదైనా సమాచారాన్ని స్టోర్ చేసుకోవద్దని భావిస్తే బాక్సులో అన్‌చెక్ చేసుకోవాలి. ‘యూజర్‌నేమ్స్ అండ్ పాస్వర్డ్స్’ ఫీచర్లోకి వెళ్లి కావాల్సినట్టుగా ఎడిట్ లేదా డిలీట్ చేసుకోవచ్చు. నకిలీ, తేలికగా అంచనా వేయగల, ఆన్లైన్లో లీకయిన డేటాలో కనిపించే పాస్‌వర్డ్‌ల గురించీ సఫారీ హెచ్చరిస్తుంది. దీంతో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటానికి వీలవుతుంది. ‘క్రెడిట్ కార్డ్సు’ విబాగం ద్వారా సేవ్ అయిన పేమెంట్ సమాచారం తెలుసుకోవచ్చు. దీన్ని ఎడిట్ చేసుకోవటానికి లేదు. జాబితాలో కొత్త సమాచారాన్ని మాత్రమే జోడించుకోవటానికి వీలుంటుంది. వద్దనుకుంటే ‘రిమూవ్’ చేసుకోవచ్చు. ‘అదర్ ఫామ్స్’ విభాగంలో చిరునామాలు, ఫోన్ నంబర్ల వివరాలుంటాయి. తప్పుడు సమాచారమైతే సరిదిద్దుకోవచ్చు. వద్దనుకుంటే తొలగించుకోవచ్చు.
ఫైర్‌ఫాక్స్‌లో
మాటిమాటికి టైప్ చేయాల్సిన అవసరం లేకుండా సమాచారాన్ని గుర్తుపెట్టుకునేలా ఫైర్‌ఫాక్స్‌లో సమగ్ర టూల్స్ ఉంటాయి. పైన కుడివైపున అడ్డం గీతల మీద క్లిక్ చేసి, సెటింగ్స్ ద్వారా ‘ప్రైవసీ అండ్ సెక్యూరిటీ’ విభాగంలోకి వెళ్లొచ్చు. ఇందులోని ‘లాగిన్స్ అండ్ పాస్వర్డ్స్’లోకి వెళ్లి లాగిన్ వివరాలను సేవ్ చేసుకోవద్దో లేదో నిర్ణయించుకోవచ్చు. ఆయా సైట్లలోకి ఆటోమేటిక్‌గా లాగిన్ అవకుండా సెట్ చేసుకోవచ్చు. సేవ్డ్ లాగిన్స్‌లో సేవ్ అయిన అన్ని వివరాలు తెలుస్తాయి. కావాలంటే వీటిని ఎడిట్ లేదా రిమూవ్ చేసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs PAK : దాయాదుల పోరులో భారత్‌కే ఎడ్జ్.. ఎందుకో చెప్పిన పాక్ మాజీ ఆటగాడు
-
General News
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
-
World News
China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
-
General News
Urine test: మూత్ర పరీక్షలతో జబ్బుల గుట్టురట్టు
-
Technology News
Apple Update: యాపిల్ యూజర్లకు అలర్ట్.. వెంటనే అప్డేట్ చేసుకోండి!
-
Movies News
Samantha: డియర్ సామ్ మేడమ్.. ఎక్కడికి వెళ్లిపోయారు..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
- Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!
- Telangana News: తెదేపాకు రాజీనామా చేస్తా.. కొత్తకోట దయాకర్‌రెడ్డి కంటతడి