Google Meet: గూగుల్ మీట్‌లో చిటికెలో అన్‌మ్యూట్

గూగుల్‌ మీట్‌లో అన్‌మ్యూట్‌, మ్యూట్‌ చేసుకోవటం మరింత తేలిక కానుంది. స్పేస్‌బార్‌ను నొక్కి పట్టుకుంటే అన్‌మ్యూట్‌ చేసుకునేలా..

Updated : 01 Sep 2022 07:55 IST

గూగుల్‌ మీట్‌లో అన్‌మ్యూట్‌, మ్యూట్‌ చేసుకోవటం మరింత తేలిక కానుంది. స్పేస్‌బార్‌ను నొక్కి పట్టుకుంటే అన్‌మ్యూట్‌ చేసుకునేలా.. వదిలితే మ్యూట్‌ చేసుకునేలా కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. అన్‌మ్యూట్‌ చేశాక తిరిగి మ్యూట్‌ చేయటం మరచిపోయే సందర్భాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. గూగుల్‌ మీట్‌ సెటింగ్స్‌లో ఈ ఫీచర్‌ డిఫాల్ట్‌గా ఆఫ్‌ అయ్యి ఉంటుంది. స్పేస్‌బార్‌ను నొక్కినప్పుడే ఆన్‌ అవుతుంది. ‘హే గూగుల్‌’ వాయిస్‌ కంట్రోల్‌ ఫీచర్‌నూ మార్చింది. గూగుల్‌ అసిస్టెంట్‌ ఇకపై మీటింగ్‌ లేనప్పుడు మాత్రమే యాక్టివ్‌ అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని