ఎక్సెల్‌ సూత్రాలు సులువుగా

సూత్రాలను సులువుగా మార్చటానికి ఎక్సెల్‌కు నాలుగు కొత్త ఫీచర్లు తోడవ్వనున్నాయి. వెబ్‌లో అందుబాటులో ఉండే వీటితో సమయం ఆదా అవుతుంది.

Published : 04 Jan 2023 00:22 IST

సూత్రాలను సులువుగా మార్చటానికి ఎక్సెల్‌కు నాలుగు కొత్త ఫీచర్లు తోడవ్వనున్నాయి. వెబ్‌లో అందుబాటులో ఉండే వీటితో సమయం ఆదా అవుతుంది. ఎక్సెల్‌ సూత్రాల గురించి ఇంకాస్త తెలుసుకోవటానికీ ఇవి తోడ్పడతాయి. ఫార్ములా సజెషన్స్‌ ఫీచర్‌ మరింత బాగా పనికొచ్చే సూత్రాలను చూపెడుతుంది. ఫార్ములా సెల్‌లో టైప్‌ చేయగానే ఆయా విషయాల డేటా ఆధారంగా దానంతటదే మంచి సూత్రాలను సూచిస్తుంది. ‘ఫార్ములా బై ఎగ్జాంపుల్‌’ ఫీచర్‌ మొత్తం కాలాన్ని సూత్రంతో ఫిల్‌ చేసి పెడుతుంది. కాలమ్‌లో మాన్యువల్‌గా, తరచూ ఎంటర్‌ చేసే డేటాను ఇది గ్రహించి పని సులువయ్యేలా చేస్తుంది. క్వెరీస్‌ బాక్స్‌లో సెర్చ్‌ బార్‌ను జత చేయటానికి తోడ్పడేది ‘సజెస్టెడ్‌ లింక్స్‌’ ఫీచర్‌. ఆల్ట్‌, ఎఫ్‌12 (మ్యాక్‌లోనైతే ఎఫ్‌12) బటన్లను కలిపి నొక్కితే పవర్‌ క్వెరీ ఎడిటర్‌ త్వరగా ఓపెన్‌ అవుతుంది కూడా. ఇక ‘ఇమేజ్‌ ఫంక్షన్‌’ మ్యాక్‌ కోసం ఉద్దేశించింది. ఇది గడుల్లో ప్రత్యామ్నాయ టెక్స్ట్‌తో పాటు ఇమేజెస్‌ను ఇన్‌సర్ట్‌ చేయటానికి  ఉపయోగపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని