జీమెయిల్‌కు యాప్‌ పాస్‌వర్డ్‌!

ఈమెయిళ్లు మన జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయాయి. పొద్దున లేవగానే ఒకసారైనా ఇన్‌బాక్స్‌ను చూడకపోతే రోజు ఆరంభమే కాదు.

Published : 18 Jan 2023 06:04 IST

ఈమెయిళ్లు మన జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయాయి. పొద్దున లేవగానే ఒకసారైనా ఇన్‌బాక్స్‌ను చూడకపోతే రోజు ఆరంభమే కాదు. అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలకు ఈమెయిళ్లు మారుపేరుగా మారిపోయాయి మరి. వీటిల్లో ఎక్కువమంది వాడేది జీమెయిలే. స్నూజ్‌, షెడ్యూల్‌ వంటి బోలెడన్ని ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఇది త్వరలో కొత్త యూఐ వంటి సొబగులూ అద్దుకుంటోంది. మరిన్ని ఎమోజీ సపోర్టు, సెక్యూరిటీ ఫీచర్లూ అందుబాటులోకి రానున్నాయి. జీమెయిల్‌లో ఇప్పటికే 2-స్టెప్‌ వెరిఫికేషన్‌ అదనపు భద్రత ఇస్తోంది. కొన్నిసార్లు.. ముఖ్యంగా జీమెయిల్‌ ఖాతాకు థర్డ్‌పార్టీ యాప్‌లను లింక్‌ చేసేటప్పుడు ఈ సదుపాయం సరిపోకపోవచ్చు. ఆయా యాప్‌లు అనధికారికంగానూ మెయిల్‌ను యాక్సెస్‌ చేయొచ్చు. దీన్ని నివారించటానికి జీమెయిల్‌ తాజాగా యాప్‌ పాస్‌వర్డ్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో ఆయా యాప్‌లకు వేర్వేరు పాస్‌వర్డ్‌లు పెట్టుకోవచ్చు. 16 అంకెల పాస్‌కోడ్‌తో కూడుకొని ఉండే దీన్ని సెట్‌ చేసుకుంటే చాలు. ఈ పాస్‌కోడ్‌ను ఎంటర్‌ చేస్తేనే గూగుల్‌ ఖాతాను యాక్సెస్‌ చేయటానికి వీలవుతుంది. 2-స్టెప్‌ వెరిఫికేషన్‌ను టర్న్‌ ఆన్‌ చేసిన పరికరాల్లోనే ఇది పనిచేస్తుంది. దీన్ని సెట్‌ చేసుకోటానికి.

* గూగుల్‌ అకౌంట్‌లోకి వెళ్లి, సెక్యూరిటీ ఫీచర్‌ను ఎంచుకోవాలి.

* ‘సైన్‌ ఇన్‌ టు గూగుల్‌’ కింద ‘యాప్‌ పాస్‌వర్డ్‌’ను సెలెక్ట్‌ చేసుకోవాలి.

* తర్వాత ‘సెలెక్ట్‌ యాప్‌’ విభాగంలో వాడుతున్న యాప్‌ను ఎంచుకోవాలి.

*  డివైస్‌ను ఎంచుకొని, వాడుతున్న డివైస్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి. తర్వాత ‘జెనరేట్‌’ను ఎంచుకోవాలి.

*  సూచించే నిబంధనలను పాటిస్తూ యాప్‌ పాస్‌వర్డ్‌లోకి ఎంటర్‌ కావాలి. పసుపు పచ్చ బార్‌లో 16 అంకెల నంబరును కోడ్‌గా పెట్టుకోవాలి. చివరికి ‘డన్‌’ బటన్‌ నొక్కాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని