ప్రజెంటేషనే స్లైడ్‌ షోగా..

తోటి ఉద్యోగులకో, స్నేహితులకో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ పంపించాం. దాన్ని ఓపెన్‌ చేసినప్పుడు స్లైడ్స్‌ ఎడిట్‌ మోడ్‌లో కాకుండా నేరుగా స్లైడ్‌్ షోగా కనిపిస్తే? చాలా బాగుంటుంది కదా.

Published : 12 Apr 2023 00:09 IST

తోటి ఉద్యోగులకో, స్నేహితులకో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ పంపించాం. దాన్ని ఓపెన్‌ చేసినప్పుడు స్లైడ్స్‌ ఎడిట్‌ మోడ్‌లో కాకుండా నేరుగా స్లైడ్‌ షోగా కనిపిస్తే? చాలా బాగుంటుంది కదా. ఇందుకు మంచి చిట్కా ఉంది. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ను పవర్‌పాయింట్‌ షోగా ( .ppsx ఫైల్‌గా) సేవ్‌ చేసుకుంటే చాలు. అప్పుడు ఫైల్‌ను ఓపెన్‌ చేయగానే తనకు తానే స్లైడ్‌ షో మొదలవుతుంది.

* ముందుగా పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఫైలు మీద రైట్‌ క్లిక్‌ చేసి సేవ్‌ యాజ్‌ను ఎంచుకోవాలి.

*  మోర్‌ ఆప్షన్స్‌ మీద క్లిక్‌ చేయాలి.

*  బ్రౌజ్‌ చేసి, ప్రజెంటేషన్‌ను సేవ్‌ చేయాలనుకునే ఫోల్డర్‌ను గుర్తించాలి.

*  ఫైల్‌ నేమ్‌ బాక్స్‌లో ప్రజెంటేషన్‌ పేరును టైప్‌ చేయాలి.

*  సేవ్‌ యాజ్‌ టైప్‌ విభాగం కింద కనిపించే పవర్‌పాయింట్‌ షో ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

*   అప్పుడది . .ppsx ఫైల్‌గా సేవ్‌ అవుతుంది. దీని మీద డబుల్‌ క్లిక్‌ చేయగానే స్లైడ్‌ షోగా ఓపెన్‌ అవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు