డ్రైవ్‌తోనే స్కానింగ్‌!

ఒకప్పుడు చాలామంది స్కాన్‌ పరికరాలను వాడేవారు. ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌తోనే స్కాన్‌ చేసేస్తున్నారు. దీనికి స్కానింగ్‌ యాప్‌లు కూడా అవసరం లేదు.

Published : 26 Apr 2023 00:33 IST

ఒకప్పుడు చాలామంది స్కాన్‌ పరికరాలను వాడేవారు. ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌తోనే స్కాన్‌ చేసేస్తున్నారు. దీనికి స్కానింగ్‌ యాప్‌లు కూడా అవసరం లేదు. గూగుల్‌ డ్రైవ్‌తోనే స్కాన్‌ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దామా.

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో గూగుల్‌ డ్రైవ్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. గూగుల్‌ ఖాతాతో సైన్‌ ఇన్‌ అయ్యిండటం ముఖ్యం.

తర్వాత కింద కుడి మూలన తేలియాడే ప్లస్‌ గుర్తును తాకాలి.

అప్పుడూ మెనూలో కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో స్కాన్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

కెమెరా దానంతటదే ఓపెన్‌ అవుతుంది. ముందుగా కెమెరా అడిగిన అనుమతులు ఇవ్వాలి.

డాక్యుమెంట్‌ పూర్తిగా ఫ్రేమ్‌లో ఒదిగేలా సెట్‌ చేసుకోవాలి. అనంతరం ఫొటో తీయాలి.

అప్పుడు ఆ ఫొటోను వాడుకోవాలని అనుకుంటున్నారేమో కన్‌ఫర్మ్‌ చేయాలని అడుగుతుంది. ఫొటో బాగా వచ్చినట్టు అనిపిస్తే చెక్‌మార్క్‌ను తాకాలి. గూగుల్‌ డ్రైవ్‌ దానంతటదే క్రాప్‌ చేసుకొని, లైట్‌ను అడ్జస్ట్‌ చేసుకుంటుంది. అవసరమైతే మాన్యువల్‌గానూ అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్‌ బటన్‌ను తాకాలి.

ఫైల్‌కు పేరు పెట్టుకొని, సేవ్‌ చేసుకునే ఫోల్డర్‌ను ఎంచుకోవాలి. అప్పుడది పీడీఎఫ్‌ రూపంలో సేవ్‌ అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని