మీట్‌లో వ్యూయర్‌ మోడ్‌!

గూగుల్‌ తన వీడియో కాల్‌ సర్వీస్‌ మీట్‌కు తాజాగా వ్యూయర్‌ మోడ్‌ను ప్రవేశ పెట్టింది. దీంతో సమావేశానికి హాజరయ్యేవారి జాబితాను రూపొందించే సమయంలో ప్రతి ఒక్కరినీ వ్యూయర్లుగా ఎంచుకునే అవకాశం లభిస్తుంది.

Published : 07 Jun 2023 00:01 IST

గూగుల్‌ తన వీడియో కాల్‌ సర్వీస్‌ మీట్‌కు తాజాగా వ్యూయర్‌ మోడ్‌ను ప్రవేశ పెట్టింది. దీంతో సమావేశానికి హాజరయ్యేవారి జాబితాను రూపొందించే సమయంలో ప్రతి ఒక్కరినీ వ్యూయర్లుగా ఎంచుకునే అవకాశం లభిస్తుంది. అప్పుడు సమావేశంలో పాల్గొనేవారంతా ప్రేక్షకులుగానే ఉంటారు. ఆడియో, వీడియోలను షేర్‌ చేసుకోలేరు. మీట్‌లో పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ ఫీచర్‌ బాగా ఉపయోగ పడుతుంది. అతిథులు ప్రసంగించేటప్పుడు ‘ప్రేక్షకుల’ మాటలు వినిపించవు. అందువల్ల ఎలాంటి అడ్డంకులు లేకుండా సమావేశం సాగు తుంది. అలాగని హాజరయ్యేవారు పూర్తిగా ప్రేక్షకులుగానే ఉండిపోరు. ప్రశ్నలు, పోల్స్‌ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించొచ్చు. కాకపోతే ఇన్‌-మీటింగ్‌ ఛాట్‌, ఎమోజీ ప్రతిస్పందనలు వాడుకోవటానికి వీలుండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు