ఐఓఎస్ 17 అద్భుతః
యాపిల్ వార్షిక సమావేశం డబ్లూడబ్ల్యూడీసీలో కొత్త సంగతులెన్నో ప్రస్తావనకు వచ్చాయి. వీటిల్లో అందరినీ ఆకర్షిస్తోంది ఐఓఎస్ 17. త్వరలో అందుబాటులోకి రానున్న దీని ఫీచర్లను చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే.
యాపిల్ వార్షిక సమావేశం డబ్లూడబ్ల్యూడీసీలో కొత్త సంగతులెన్నో ప్రస్తావనకు వచ్చాయి. వీటిల్లో అందరినీ ఆకర్షిస్తోంది ఐఓఎస్ 17. త్వరలో అందుబాటులోకి రానున్న దీని ఫీచర్లను చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే.
ఎయిర్‌ట్యాగ్స్ షేర్
ఇకపై ఎయిర్‌ట్యాగ్స్‌ను ఐదుగురితో పంచుకోవచ్చు. దీంతో ఫైండ్‌మైలో ఏదైనా వస్తువు ఎక్కడుందో కనుక్కోవటానికి స్నేహితులు, కుటుంబ సభ్యులకూ అనుమతి లభిస్తుంది. కుటుంబంతోనో, స్నేహితులతోనో కలిసి బయటకు వెళ్లినప్పుడు కారు తాళాలు, బ్యాగుల వంటివి ఎక్కడున్నాయో తెలుసుకోవటం తేలికవుతుంది. చుట్టుపక్కల ఉన్నవారికి ఎయిర్‌ట్యాగ్‌ను షేర్ చేసినప్పుడు గ్రూపులో ఉన్న అందరూ ఆయా వస్తువులున్న చోటును చూడొచ్చు. సౌండ్ ప్లే చేయొచ్చు. ఇది ఇతర ఫైండ్ మై నెట్‌వర్క్ పరికరాలన్నింటితోనూ కలిసి పనిచేస్తుంది కూడా.
ఆఫ్‌లైన్ మ్యాప్స్
గూగుల్ వాడేవారికి మ్యాప్ యాప్‌లో ఆఫ్‌లైన్ ఫీచర్లు కొత్తేమీ కాదు. నెట్‌వర్క్ కవరేజీ లేనిచోట మ్యాప్‌లో ఆయా ప్రాంతాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కూడా. ఈ ఫీచర్ త్వరలో యాపిల్ మ్యాప్స్‌లోనూ అందుబాటులోకి రానుంది. దీంతో ఎక్కడెక్కడ ఏయే పార్కులున్నాయో తెలుసుకోవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కడెక్కడ ఛార్జింగ్ సదుపాయాలున్నాయో కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికిది అమెరికాకే పరిమితమని భావిస్తున్నా.. మున్ముందు ఇతర దేశాలకూ విస్తరించొచ్చు.
లుకప్ మరింత మెరుగ్గా
విజువల్ లుకప్ ఫీచర్ మరింత మెరుగవనుంది. ఇది ఇప్పటివరకు తీసిన ఫొటోల్లో ఆయా వస్తువుల సమాచారాన్ని తెలుసుకోవటానికే ఉపయోగపడుతోంది. ఇకపై ఫొటోలోంచే కాదు.. పాజ్ చేసిన వీడియో దృశ్యాల్లోంచీ ఆహారం, దుకాణాలు, సంకేతాల వంటి వాటి గురించీ తెలుసుకోవచ్చు.
ఇంకొన్ని ఎమోజీలు
కొత్తగా మరో మూడు.. ‘హేలో, స్మిర్క్, పీకబూ’ ఎమోజీలు అందుబాటులోకి రానున్నాయి.
కమ్యూనికేషన్ భద్రత కోసమూ
కమ్యూనికేషన్ సేఫ్టీ ఫీచర్ ఇంకాస్త మెరుగులు దిద్దుకోనుంది. ఐమెసేజెస్‌లో నగ్న చిత్రాలు పిల్లల కంటపడకుండా దాచే దీన్ని ఇప్పుడు పెద్దవాళ్లకూ విస్తరించారు. అంటే అలాంటి చిత్రాలను చూడొచ్చో లేదో మనమే నిర్ణయించుకోవచ్చన్నమాట. ఫొటోలకే కాకుండా వీడియో, ఇతర కమ్యూనికేషన్ పద్ధతులకూ దీన్ని వర్తింపజేశారు. దీనిలోని న్యూడిటీ ఫిల్టర్ ఫొటోలు, వీడియోల్లో వ్యక్తుల జననాంగాలు కనిపించకుండా చేస్తుంది. పిల్లలు ఎయిర్ డ్రాప్ ద్వారా నగ్న చిత్రాలను చూడకుండా, షేర్ చేయకుండానూ ఇది నిలువరిస్తుంది.
పాటల సంయోగం
ఒక పాటలో మరో పాటని కలిపి వినటం చాలామందికి వినోదం కలిగిస్తుంది. ఇదిప్పుడు యాపిల్ మ్యూజిక్ యాప్‌లోనూ అందుబాటులోకి రానుంది.
ప్లేలిస్ట్‌లో భాగస్వామ్యం
మనమేదో పాటల జాబితా రూపొందిస్తాం. కానీ మన స్నేహితుడు అందులో మరో పాటని జత చేయాలని అనుకున్నాడు. ఇదీ త్వరలో సాకారం కానుంది. షేర్ చేసిన ప్లేలిస్టులో ఇష్టమైన పాటలను జోడించటం, ఇష్టంలేని వాటిని తొలగించటం సాధ్యమవుతుంది. పాటల క్రమాన్ని కూడా మార్చేయొచ్చు. అంతేనా? ఆయా మార్పులకు ఎమోజీతో ప్రతిస్పందన కూడా తెలియజేయొచ్చు.
నేమ్‌డ్రాప్‌తో షేరింగ్
మన ఐఫోన్‌లోంచి కుటుంబసభ్యుల ఐఫోన్‌లోకి కాంటాక్ట్‌ను షేర్ చేసుకోవటానికి నేమ్‌డ్రాప్ ఫీచర్ రానుంది. రెండు ఐఫోన్లను ఒకదాని పక్కన మరోటి పెడితే చాలు. కాంటాక్ట్ సమాచారం దానంతటదే బదిలీ అవుతుంది. ఏయే ఈమెయిళ్లు, నంబర్లు షేర్ చేసుకోవాలో ఎంచుకోవచ్చు కూడా. కంటెంట్‌నూ పంచుకోవచ్చు. షేర్‌ప్లే ద్వారా ఒకే పాటను ఇద్దరూ కలిసి వినొచ్చు.
కొత్త జర్నల్ యాప్
ఐఓఎస్ 17 సరికొత్తగా జర్నల్ యాప్‌తోనూ ముస్తాబవుతోంది. పేరుకు తగ్గట్టుగానే ఇది మన ఆలోచనలను, జ్ఞాపకాలను రాసుకోవటానికి తోడ్పడుతుంది. ఫొటోలు, ఆడియో రికార్డింగులు, పాటలు, సంగీతాన్నీ దీనికి జోడించుకోవచ్చు. లక్ష్యాలనూ రాసిపెట్టుకోవచ్చు. పరికరంలోని మెషిన్ లెర్నింగ్ పరిజ్ఞానం రాసుకోవటానికి తగిన సందర్భాలనూ సూచిస్తుంది!
అడాప్టివ్ ఆడియో
రెండో తరం ఎయిర్‌పాడ్స్ ప్రొ గలవారికి అడాప్టివ్ ఆడియో అనే కొత్త మోడ్ అందుబాటులోకి రానుంది. ఇది యాపిల్‌కు చెందిన ట్రాన్స్‌పరెన్సీ మోడ్, యాక్టివ్ నాయిస్ ఫీచర్ల సమ్మేళనం. చికాకు పెట్టే శబ్దాలను అడ్డుకొని, ముఖ్యమైన విషయాన్ని స్పష్టంగా వినిపిస్తుంది. ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు కన్వర్జేషన్ అవేర్‌నెస్ మోడ్ తనకు తానే మీడియా వాల్యూమ్‌ను, నేపథ్య శబ్దాలను తగ్గిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ayodhya Temple: జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం!
-
World Cup 2023: వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. సీనియర్ ఆటగాడికి దక్కని చోటు
-
TET Results: 27న టెట్ ఫలితాలు.. ఎన్నిగంటలకంటే?
-
PM Modi: అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలో మోదీ పర్యటన
-
IND vs AUS: షమి, శార్దూల్ ఇంటికి.. ఆసీస్‌తో మూడో వన్డేకు టీమ్ఇండియాలో 13 మందే
-
CM Kcr: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత