కొత్త సాధనాలకు న్యూ చిట్కా!

డాక్స్‌, షీట్స్‌, మీట్‌, క్యాలెండర్‌.. ఇలా ఉద్యోగ, వ్యక్తిగత అవసరాల కోసం గూగుల్‌ సాధనాలు చాలానే ఉన్నాయి. వాడేవారికి వీటి గొప్పతనం తెలియంది కాదు.

Updated : 28 Jun 2023 01:04 IST
.new  షార్ట్‌కట్‌ ఒక్క గూగుల్‌ సాధనాలకే కాదు.. మైక్రోసాఫ్ట్‌ ఫీచర్లకూ ఉపయోగపడుతుంది. ‌word.new  అని టైప్‌ చేస్తే కొత్త వర్డ్‌ డాక్యుమెంట్‌ ఓపెన్‌ అవుతుంది. excel.new అని టైప్‌ చేస్తే కొత్త ఎక్సెల్‌ స్ప్రెడ్‌షీట్‌ క్రియేట్‌ అవుతుంది. స్పోటిఫై ప్లేలిస్ట్‌ కోసం playlist.new, అడోబ్‌ ఫొటోషాప్‌లో కొత్త ఇమేజ్‌ను సృష్టించటానికి photoshop.new ఇలా చాలా వాటికి దీన్ని ఉపయోగించుకోవచ్చు.
డాక్స్‌, షీట్స్‌, మీట్‌, క్యాలెండర్‌.. ఇలా ఉద్యోగ, వ్యక్తిగత అవసరాల కోసం గూగుల్‌ సాధనాలు చాలానే ఉన్నాయి. వాడేవారికి వీటి గొప్పతనం తెలియంది కాదు. అయితే చిటికెలో కొత్త డాక్యుమెంట్‌, షీట్‌ తెరవటానికి న్యూ అనే పదం ఉపయోగ పడుతుందని చాలామందికి తెలియదనే అనుకోవచ్చు. ఇది ఏ బ్రౌజర్‌లోనైనా పనిచేస్తుంది. కొత్త గూగుల్‌ డాక్యుమెంట్‌ను తెరవటానికి docs.new అని టైప్‌ చేస్తే చాలు. ఎందుకంటే .new అనేది .com కు దాదాపు సమానం మరి. అయితే ఇంకెందుకు ఆలస్యం. ఓసారి ప్రయత్నిస్తే పోలా.
  • కొత్త గూగుల్‌ డాక్యుమెంట్‌ ఓపెన్‌ కావటానికి- docs.new వాడొచ్చు.
  • కొత్త గూగుల్‌ షీట్స్‌ ఓపెన్‌ చేయటానికి- sheets.new
  • గూగుల్‌ మీట్‌లో మనమే కొత్త వీడియో కాల్‌ ఆరంభించటానికి meet.new. (ఇది సృష్టించే లింకును కాపీ చేసి మీటింగ్‌ కోసం ఇతరులనూ ఆహ్వానించొచ్చు)
  • గూగుల్‌ క్యాలెండర్‌లో ఈవెంట్‌ను క్రియేట్‌ చేయటానికి- cal.new
  • కొత్త గూగుల్‌ ఫారమ్‌ను సృష్టించటానికి form.new
  • గూగుల్‌ స్లైడ్స్‌లో కొత్త స్లైడ్‌షోను ఆరంభించటానికి- slides.new వాడుకోవచ్చు.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు