వెబ్‌సైటే యాప్‌గా..

మామూలు వెబ్‌సైట్‌నూ విండోస్‌ ప్రోగ్రామ్‌గా మార్చుకోవచ్చనే సంగతి మీకు తెలుసా? యాప్‌గా పనిచేసే దీన్ని టాస్క్‌బార్‌ మీద షార్ట్‌కట్‌గానూ పెట్టుకోవచ్చు

Published : 05 Jul 2023 00:36 IST

మామూలు వెబ్‌సైట్‌నూ విండోస్‌ ప్రోగ్రామ్‌గా మార్చుకోవచ్చనే సంగతి మీకు తెలుసా? యాప్‌గా పనిచేసే దీన్ని టాస్క్‌బార్‌ మీద షార్ట్‌కట్‌గానూ పెట్టుకోవచ్చు. దీన్నే ప్రోగ్రెసివ్‌ వెబ్‌ యాప్‌ (పీడబ్ల్యూఏ) అంటారు. ఆశ్చర్యంగా అనిపించినా కొన్ని వెబ్‌సైట్లకు ఇది నిజంగానే వర్తిస్తుంది.
ఉదాహరణకు గూగుల్‌ మ్యాప్స్‌ వెబ్‌సైట్‌ను వెబ్‌ యాప్‌గా మార్చుకోవాలని అనుకున్నారనుకోండి. ముందుగా..గూగుల్‌ క్రోమ్‌ లేదా మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ వంటి బ్రౌజర్లలో maps.google.com వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయాలి. పైన కుడిమూలన కనిపించే నిలువు మూడు చుక్కల మీద క్లిక్‌ చేస్తే మెనూ జాబితా కనిపిస్తుంది. క్రోమ్‌లో అయితే ఇన్‌స్టాల్‌ గూగుల్‌ మ్యాప్స్‌ను ఎంచుకోవాలి. ఎడ్జ్‌లోనైతే యాప్స్‌లోకి వెళ్లి ఇన్‌స్టాల్‌ గూగుల్‌ మ్యాప్స్‌ను ఎంచుకోవాలి. బ్రౌజర్‌ అడ్రస్‌ మీద కుడివైపున కనిపించే ఇన్‌స్టాల్‌ షార్ట్‌కట్‌ బటన్‌తోనూ దీన్ని ఎంచుకోవచ్చు. అనంతరం ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. క్రోమ్‌ వాడుతున్నట్టయితే గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త, మినిమైజ్డ్‌ విండోలో తెరచుకుంటుంది. ఎడ్జ్‌ వాడేవారైతే సెటింగ్స్‌ మెనూ ద్వారా యాప్‌ను టాస్క్‌బార్‌ లేదా స్టార్ట్‌ మెనూ మీద పిన్‌ చేసుకోవాలి. డెస్క్‌టాప్‌ షార్ట్‌కట్‌నూ సృష్టించుకోవచ్చు. దానంతటదే స్టార్ట్‌ అయ్యేలా కూడా సెట్‌ చేయొచ్చు. ఇష్టమైన వాటిని నిర్ణయించుకొని ‘అలో’ ఫీచర్‌ను ఎంచుకోవాలి. అక్కడి నుంచి గూగుల్‌ మ్యాప్స్‌ వెబ్‌సైట్‌ కాస్తా వెబ్‌ యాప్‌గా ఓపెన్‌ అవుతుంది. దీని సెటింగ్స్‌లోకి వెళ్లాలనుకుంటే పైన కుడిమూలన కనిపించే గుర్తు మీద క్లిక్‌ చేస్తే చాలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు