ఛాట్‌జీపీటీతో పీడీఎఫ్‌ ఫైలు వివరాలు

పీడీఎఫ్‌ ఫైలులో చాలా కంటెంట్‌ ఉందా? దాని సారాంశాన్ని చిటికెలో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఛాట్‌జీపీటీ సాయం తీసుకోవచ్చు.

Published : 19 Jun 2024 00:00 IST

పీడీఎఫ్‌ ఫైలులో చాలా కంటెంట్‌ ఉందా? దాని సారాంశాన్ని చిటికెలో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఛాట్‌జీపీటీ సాయం తీసుకోవచ్చు. జీపీటీ-4ఓ అప్‌డేట్‌ మూలంగా ఫైళ్లను అప్‌లోడ్‌ చేసి వాటికి సంబంధించిన పనులు చేసిపెట్టమని అడిగే అవకాశం కలిగింది. దీన్ని ఎలా వాడుకోవాలి?

  • బ్రౌజర్‌ లేదా మొబైల్‌ ఫోన్‌లో ఛాట్‌జీపీటీని ఓపెన్‌ చేసి, ఖాతాతో లాగిన్‌ కావాలి. బేసిక్‌ ఫీచర్లను ఉచితంగానే వాడుకోవచ్చు గానీ కొత్త సదుపాయాలను ఉపయోగించుకోవాలంటే మాత్రం లాగిన్‌ కావాల్సిందే.
  • కొత్త ఛాట్‌ను ఆరంభించటం లేదా పాత ఛాట్‌ను కొనసాగించటం చేయాలి. పేపర్‌ క్లిప్‌ గుర్తు మీద క్లిక్‌ చేయాలి.
  • అప్పుడు కొత్త మెనూ ఓపెన్‌ అవుతుంది. ఇది గూగుల్‌ డ్రైవ్‌ లేదా మైక్రోసాఫ్ట్‌ ఓపెన్‌ డ్రైవ్‌తో ఛాట్‌జీపీటీ అనుసంధానం కావటానికి వీలు కల్పిస్తుంది. లేదూ కంప్యూటర్‌ నుంచి అయినా ఫైలు అప్‌లోడ్‌ చేయొచ్చు.
  • ఫైలును ఎంచుకొని అప్‌లోడ్‌ చేశాక టెక్స్ట్‌ బాక్సులోకి వెళ్లాలి. ఆ ఫైలుతో ఏం చేయాలని అనుకుంటున్నామో వివరంగా రాయాలి. అంతే.. ఆ వెంటనే సంబంధిత జవాబులు ప్రత్యక్షమవుతాయి. ఉదాహరణకు- ఫైలు సారాంశాన్నో, ముఖ్యమైన విషయాలనో చూపమని అడిగారనుకోండి. అవి వరుసగా కనిపిస్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని