విమర్శ జీపీటీ కూడా..

క్రిటిక్‌జీపీటీ అనే కొత్త ఏఐ మోడల్‌ను రూపొందిస్తున్నట్టు ఓపెన్‌ ఏఐ సంస్థ ప్రకటించింది. జీపీటీ-4తో రూపొందించిన కోడ్‌లో పొరపాట్లను గుర్తించి, సరిచేయటం దీని ఉద్దేశం.

Published : 03 Jul 2024 00:43 IST

క్రిటిక్‌జీపీటీ అనే కొత్త ఏఐ మోడల్‌ను రూపొందిస్తున్నట్టు ఓపెన్‌ ఏఐ సంస్థ ప్రకటించింది. జీపీటీ-4తో రూపొందించిన కోడ్‌లో పొరపాట్లను గుర్తించి, సరిచేయటం దీని ఉద్దేశం. ఇది మనుషుల నుంచి అందే ఫీడ్‌బ్యాక్‌ ద్వారా తిరిగి నేర్చుకునే పరిజ్ఞాన (రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ లెర్నింగ్‌ ఫ్రమ్‌ హ్యూమన్‌ ఫీడ్‌బ్యాక్‌ - ఆర్‌ఎల్‌హెచ్‌ఎఫ్‌) సామర్థ్యాలను వినియోగించుకుంటుంది. ఈ పరిజ్ఞానం మనం ఇచ్చే ఆదేశాలు, పరికరం అదించే సమాధానాలను మేళవించి ఏఐ వ్యవస్థలను మెరుగు పరుస్తుంది. ప్రస్తుతానికి క్రిటిక్‌జీపీటీ అభివృద్ధి దశలోనే ఉంది. ఏఐ సృష్టించే కోడ్‌ల నాణ్యతను మెరుగు పరచే ఉద్దేశంతో ఇంకా యూజర్లకు లేదా టెస్టర్లకు అందుబాటులోకి తీసుకురాలేదు. అయితే పరీక్షల్లో ఇది మంచి నైపుణ్యం కనబరు స్తున్నట్టు ఓపెన్‌ఏఐ సంస్థ పేర్కొంది. ఛాట్‌జీపీటీ సృష్టించిన కోడ్‌ను దీంతో సమీక్షించగా 60% వరకూ మెరుగైన ఫలితాలను చూపించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని