గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ భాషల విస్తరణ

టెక్‌ దిగ్గజం గూగుల్‌ తమ అనువాద సేవలను గణనీయంగా విస్తరించింది. గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌కు మరో 110 భాషలను జోడించింది.

Published : 03 Jul 2024 00:44 IST

టెక్‌ దిగ్గజం గూగుల్‌ తమ అనువాద సేవలను గణనీయంగా విస్తరించింది. గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌కు మరో 110 భాషలను జోడించింది. దీంతో ఇది అనువాదం చేయగల భాషల సంఖ్య 243కు చేరుకుంది. కృత్రిమ మేధ సాయంతో కొత్త భాషలను నేర్చుకునే పామ్‌2 లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ మూలంగా ఈ కొత్త భాషల జోడింపు సాధ్యమైంది. వీటిల్లో ఏడు భారతీయ భాషలు కూడా ఉన్నాయి. మనదగ్గర ఇప్పుడు అవధి, బోడో, ఖాసి, కాక్‌బోరాక్, సంతాలీ, తుళు భాషల్లోనూ గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ సేవలు అందుబాటులో ఉంటాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని