ట్రూకాలర్‌ బీమా

ట్రూకాలర్‌ అనగానే ఫోన్‌ చేసే వ్యక్తుల గురించి తెలియజేయటమే గుర్తుకొస్తుంది. ఇప్పుడిది తమ యాప్‌ను వాడేవారిని ఆన్‌లైన్‌ మోసాలు, నేరాల నుంచి కాపాడుకోవటానికీ నడుం బిగించింది.

Published : 10 Jul 2024 01:01 IST

ట్రూకాలర్‌ అనగానే ఫోన్‌ చేసే వ్యక్తుల గురించి తెలియజేయటమే గుర్తుకొస్తుంది. ఇప్పుడిది తమ యాప్‌ను వాడేవారిని ఆన్‌లైన్‌ మోసాలు, నేరాల నుంచి కాపాడుకోవటానికీ నడుం బిగించింది. మొబైల్‌ ఫోన్‌ మోసాల బారినపడ్డవారి కోసం బీమా పథకాన్నీ ఆరంభించింది. దీని పేరు ట్రూకాలర్‌ ఫ్రాడ్‌ ఇన్సూరెన్స్‌. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ పరికరాల్లో ఈ యాప్‌ను వాడే పెయిడ్‌ సబ్‌ స్క్రయిబర్లకు.. అదీ వార్షిక ప్రీమియం చెల్లించిన వారికే వర్తిస్తుంది. ప్రస్తుతానికి ఈ బీమా మనదేశంలోనే అందుబాటులో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో సహకారంతో దీన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద రూ.10వేల వరకు బీమా పొందొచ్చు. మరోవైపు.. ఏఐ ఆధారిత వాయిస్‌ మోసాలను నివారించటానికి ట్రూకాలర్‌ ఇటీవల ఏఐ కాల్‌ స్కానర్‌ ఫీచర్‌నూ తీసుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని