ఆండ్రాయిడ్‌ కోసం కలెక్షన్స్‌

ఆండ్రాయిడ్‌ పరికరాల కోసం గూగుల్‌ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దీని పేరు కలెక్షన్స్‌. ఇది ఇన్‌స్టాల్‌ అయిన యాప్‌ల నుంచి సమంజసమైన కంటెంట్‌ను చూపించగలదు.

Published : 10 Jul 2024 01:02 IST

ఆండ్రాయిడ్‌ పరికరాల కోసం గూగుల్‌ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దీని పేరు కలెక్షన్స్‌. ఇది ఇన్‌స్టాల్‌ అయిన యాప్‌ల నుంచి సమంజసమైన కంటెంట్‌ను చూపించగలదు. మొదట్లో అమెరికాలో అందుబాటులోకి తీసుకొచ్చి, తర్వాత మిగతా దేశాలకు విస్తరించాలని భావిస్తున్నారు. ఇది క్రియేట్, వాచ్, రీడ్, లిజన్, షాప్, సోషల్‌ వంటి విభాగాలు గల విడ్జెట్‌తో కూడుకొని ఉంటుంది. ఆయా విభాగాలను ఎంచుకుంటే యాప్‌లకు సంబంధించి అవసరమైన సమాచారాన్ని ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది. ఉదాహరణకు- ఆన్‌లైన అంగళ్లలో ఏదైనా వస్తువును కొన్నారనుకోండి. అది ఎక్కడ ఉంది? ఎప్పుడు డెలివరీ అవుతుంది? ఇలాంటి వివరాలన్నింటినీ తెలియజేస్తుంది. ప్లే స్టోర్‌ గుర్తు మీద కాసేపు అదిమి పట్టి ఉంచటం ద్వారానూ కలెక్షన్స్‌ ఫీచర్‌ను యాక్సెస్‌ చేయొచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని