పైథాగరస్‌కు వెయ్యేళ్ల ముందే

లంబకోణ త్రిభుజంలో కర్ణం వైపు వర్గం మిగిలిన రెండు వైపుల వర్గాల మొత్తానికి సమానం (a2 + b2 = c2). ఇది పైథాగరస్‌ సూత్రం. దీని గురించి బడిలో చదువుకునే ఉంటారు.

Updated : 29 Dec 2021 04:22 IST

లంబకోణ త్రిభుజంలో కర్ణం వైపు వర్గం మిగిలిన రెండు వైపుల వర్గాల మొత్తానికి సమానం (a2 + b2 = c2). ఇది పైథాగరస్‌ సూత్రం. దీని గురించి బడిలో చదువుకునే ఉంటారు. అయితే దీన్ని గణించింది ఫైథాగరస్‌ ఒక్కరే కాదు. ఆయన పుట్టడానికి వెయ్యేళ్ల ముందుగానే బాబిలోనియన్లు దీన్ని వాడుకున్నట్టు బయటపడింది. ఇరాక్‌లో లభించిన 3,700 ఏళ్ల క్రితం ఫలకాన్ని డాక్టర్‌ డేనియల్‌ మ్యాన్స్‌ఫీల్డ్‌ అనే గణిత శాస్త్రవేత్త విశ్లేషించి ఈ విషయాన్ని గుర్తించారు. భూమిని విభజించటానికి, హద్దులు ఏర్పాటు చేయటానికి బాబిలోనియన్లు సరిగ్గా ఫైథాగరస్‌ సూత్రం వంటి విధానాన్నే ఉపయోగించుకునేవారని నిరూపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని