క్లబ్‌హౌజ్‌లో బయటి లింక్స్‌ షేర్‌

క్లబ్‌హౌజ్‌ త్వరలో ఇతర లింకులను షేర్‌ చేసుకోవటానికి, తమ ఉత్పత్తులను అమ్ముకోవటానికి మోడరేటర్లకు వీలు కల్పించనుంది. ఇందుకోసం పిన్‌డ్‌ లింక్స్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది.

Updated : 03 Nov 2021 05:37 IST

క్లబ్‌హౌజ్‌ త్వరలో ఇతర లింకులను షేర్‌ చేసుకోవటానికి, తమ ఉత్పత్తులను అమ్ముకోవటానికి మోడరేటర్లకు వీలు కల్పించనుంది. ఇందుకోసం పిన్‌డ్‌ లింక్స్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. దీన్ని ఎనేబుల్‌ చేసుకుంటే ఛాట్‌రూమ్‌ పైభాగాన ఇతర లింక్‌లను తేలికగా షేర్‌ చేసుకోవచ్చు. శ్రోతలు వీటి ద్వారా ఆయా వార్తలు, కథనాలు, పోడ్‌కాస్ట్‌లను వినొచ్చు. ఛాట్‌రూమ్‌ మోడరేటర్‌గా ఉన్నంతవరకు ఎవరైనా లింక్‌ను జోడించొచ్చు, మార్చొచ్చు, తొలగించొచ్చు. దీనికి ఫాలో అయ్యేవారి సంఖ్యతో ప్రమేయమేమీ లేదు. ఉచితంగానే లింక్స్‌ షేర్‌ చేసుకోవచ్చు. వీటి ద్వారా వచ్చిన ఆదాయంలో క్లబ్‌హౌజ్‌కు వాటా ఇవ్వాల్సిన పని లేదు. అయితే భద్రత రీత్యా కొన్నిరకాల లింక్స్‌ను ఇందుకు అనుతించరు. ఇలాంటి లింక్స్‌ పేర్లను బయటపెట్టలేదు గానీ ‘ఓన్లీఫ్యాన్స్‌’ వంటివి ఇందులో ఉండొచ్చని భావిస్తున్నారు. సాధారణంగా అశ్లీల అంశాలతో కూడినవి ఓన్లీఫ్యాన్స్‌ విభాగంలోకి వస్తుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని