ఒకేసారి రెండు ట్విటర్‌ ఖాతాలు

ట్విటర్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తాజా ధోరణులైనా, సంఘటనలైనా.. ఏవైనా ఇట్టే తెలుసుకోవటానికిది బాగా తోడ్పడుతుంది. తక్కువ పదాల్లో ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోవటానికీ ఉపయోగపడుతుంది. కొందరు ఒకటి కన్నా ఎక్కువ ట్విటర్‌ ఖాతాలనూ తెరుస్తుంటారు.

Updated : 22 Dec 2021 05:04 IST

ట్విటర్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తాజా ధోరణులైనా, సంఘటనలైనా.. ఏవైనా ఇట్టే తెలుసుకోవటానికిది బాగా తోడ్పడుతుంది. తక్కువ పదాల్లో ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోవటానికీ ఉపయోగపడుతుంది. కొందరు ఒకటి కన్నా ఎక్కువ ట్విటర్‌ ఖాతాలనూ తెరుస్తుంటారు. వీటిని ఒకేసారి తేలికగా చూసుకునే వెసులుబాటూ ఉంది. రెండు, అంతకన్నా ఎక్కువ ఖాతాలను మెర్జ్‌ చేయటానికి వీలుండదు గానీ ఒకేసారి వీటిని చూసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యాప్స్‌లో.. డెస్క్‌టాప్‌లో దీన్ని తేలికగా సెట్‌ చేసుకోవచ్చు.
* ఐఓఎస్‌ పరికరంలోనైతే- నావిగేషన్‌ మెనూ ద్వారా మోర్‌ గుర్తును నొక్కి కొత్త ఖాతాను తెరవచ్చు. అప్పటికే ఉన్న ఖాతానూ జోడించుకోవచ్చు. అదనపు ఖాతాను జోడించుకున్నాక ప్రొఫైల్‌ గుర్తును ట్యాప్‌ చేసి ఆయా ఖాతాలను వేర్వేరుగా ఉపయోగించుకోవచ్చు.
* ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోనైతే- ప్రొఫైల్‌ గుర్తును నొక్కి, పేరు పక్కన కనిపించే డౌన్‌ యారోను తాకాలి. దాని కింద కనిపించే ఫీచర్ల ద్వారా కొత్త ఖాతాను తెరవచ్చు. అదనపు ఖాతాను జోడించుకోవచ్చు.
* డెస్క్‌టాప్‌లోనైతే- ప్రొఫైల్‌లోకి వెళ్లి ఎడమ వైపున అన్నింటికన్నా కింద పేరు పక్కన అడ్డంగా కనిపించే గీతల ద్వారా అదనపు ఖాతా జోడించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని