ఫేస్‌బుక్‌ప్రొఫైల్‌ లాక్‌ చేస్తారా?

ఫేస్‌బుక్‌ మరింత భద్రత కోసం ప్రొఫైల్‌ లాక్‌ ఫీచర్‌ను ఆరంభించింది. దీన్ని ఎనేబుల్‌ చేసుకుంటే స్నేహితుల జాబితాలో లేనివారికి ప్రొఫైల్‌ పాక్షికంగానే కనిపిస్తుంది. అలాగే ప్రొఫైల్‌ ఫొటోను గానీ ఇతర పోస్టులను గానీ స్క్రీన్‌ షాట్‌ ...

Published : 05 Jan 2022 00:35 IST

ఫేస్‌బుక్‌ మరింత భద్రత కోసం ప్రొఫైల్‌ లాక్‌ ఫీచర్‌ను ఆరంభించింది. దీన్ని ఎనేబుల్‌ చేసుకుంటే స్నేహితుల జాబితాలో లేనివారికి ప్రొఫైల్‌ పాక్షికంగానే కనిపిస్తుంది. అలాగే ప్రొఫైల్‌ ఫొటోను గానీ ఇతర పోస్టులను గానీ స్క్రీన్‌ షాట్‌ తీసుకోవటానికి కూడా వీలుపడదు. ఒకసారి ప్రొఫైల్‌ లాక్‌ చేసుకుంటే స్నేహితుల జాబితాలో ఉన్నవారు మాత్రమే టైమ్‌లైన్‌ మీదున్న ఫొటోలు, పోస్టులు.. ప్రొఫైల్‌ పిక్చర్‌, కవర్‌ ఫొటో, స్టోరీస్‌, కొత్త పోస్టులను చూడగలుగుతారు. మొబైల్‌ యాప్‌ లేదా బ్రౌజర్‌ ద్వారా ప్రొఫైల్‌ను లాక్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతానికిది ఆండ్రాయిడ్‌ ఫోన్లకే పరిమితం. డెస్క్‌టాప్‌ ద్వారా ఐఫోన్లకూ వర్తింపజేసుకోవచ్చు.

ప్రొఫైల్‌ లాక్‌ ఇలా..
* మొబైల్‌లో ఫేస్‌బుక్‌ యాప్‌ ఓపెన్‌ చేసి, ప్రొఫైల్‌ మీద ట్యాప్‌ చేయాలి.
* యాడ్‌ స్టోరీ పక్కనుండే మూడు చుక్కల గుర్తు పైన క్లిక్‌ చేయాలి.
* ఇందులో కనిపించే లాక్‌ ప్రొఫైల్‌ అవకాశాన్ని ట్యాప్‌ చేయాలి.
* అప్పుడు కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందో ఇది వివరిస్తుంది. పేజీ కిందికి వెళ్తే లాక్‌ యువర్‌ ప్రొఫైల్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీన్ని తాకితే ‘యు లాక్డ్‌ యువర్‌ ప్రొఫైల్‌’ అని తెర మీద ప్రత్యక్షమవుతుంది.
* మార్చిన సెటింగ్స్‌ను కన్‌ఫర్మ్‌ చేస్తే ప్రొఫైల్‌ లాక్‌ అయినట్టే.

డెస్క్‌టాప్‌ ద్వారా...
* డెస్క్‌టాప్‌లోనైతే బ్రౌజర్‌ ద్వారా ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌లోకి వెళ్లాలి. పోస్టులు, అబౌట్‌ వరుసలో చివరగా ఉండే మూడు అడ్డగీతల మెనూను నొక్కాలి. అప్పుడు దిగువన ‘లాక్‌ ప్రొఫైల్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఐఫోన్‌ వాడేవారు కూడా ఇలా డెస్క్‌టాప్‌ ద్వారా ప్రొఫైల్‌ లాక్‌ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని