గూగుల్‌ అదనపు లాభం

ఆండ్రాయిడ్‌ ఫోన్లు వాడేవారికి జీమెయిల్‌ లేదా గూగుల్‌ ఖాతా ప్రాధాన్యమేంటో తెలిసే ఉంటుంది. గూగుల్‌ ప్లే, ఇతర సేవలను పొందటానికిది తప్పనిసరి. రెండో ఖాతానూ కలిగుంటే మరింత లాభం పొందొచ్చు. వ్యక్తిగత సమాచారాన్ని స్టోర్‌ చేయటానికి ఎంతోమంది గూగుల్‌ డ్రైవ్‌, గూగుల్‌ ఫొటోస్‌, జీమెయిల్‌ వంటి యాప్స్‌నూ ఉపయోగిస్తుంటారు.

Updated : 19 Jan 2022 05:32 IST

ఆండ్రాయిడ్‌ ఫోన్లు వాడేవారికి జీమెయిల్‌ లేదా గూగుల్‌ ఖాతా ప్రాధాన్యమేంటో తెలిసే ఉంటుంది. గూగుల్‌ ప్లే, ఇతర సేవలను పొందటానికిది తప్పనిసరి. రెండో ఖాతానూ కలిగుంటే మరింత లాభం పొందొచ్చు. వ్యక్తిగత సమాచారాన్ని స్టోర్‌ చేయటానికి ఎంతోమంది గూగుల్‌ డ్రైవ్‌, గూగుల్‌ ఫొటోస్‌, జీమెయిల్‌ వంటి యాప్స్‌నూ ఉపయోగిస్తుంటారు. మరి ఎప్పుడైనా గూగుల్‌ ఐడీని మరచిపోతే? అందుకే గూగుల్‌ ఖాతాకు అదనపు భద్రతను జోడించుకోవటం ఎంతైనా అవసరం. దీనికీ రెండో గూగుల్‌ ఖాతాకు సంబంధమేంటని అనుకుంటున్నారా? యూజర్‌నేమ్‌/పాస్‌వర్డ్‌ లేదూ వెరిఫికేషన్‌ కోడ్‌ మరచిపోయినా.. ప్రస్తుత గూగుల్‌ ఖాతా హ్యాక్‌ అయినా రెండో ఖాతా ఆదుకుంటుంది. ఖాతాకు ఫోన్‌ నంబరును యాడ్‌ చేసుకోవటం ద్వారానూ యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లను తిరిగి పొందొచ్చనుకోండి. కొందరు ఇతర మెయిల్‌ ఖాతాలతోనూ వీటిని మళ్లీ క్రియేట్‌ చేసుకుంటుంటారు కూడా. అయినా రెండో ఖాతాతో ఇవే కాదు.. ఇతరత్రా సౌకర్యాలూ లభిస్తాయి. ఒకో గూగుల్‌ ఖాతాతో స్మార్ట్‌ఫోన్‌లో 15జీబీ ఉచిత క్లౌడ్‌ స్టోర్‌ లభిస్తుంది. ఇది ప్రైమరీ ఖాతా కాదు కాబట్టి ఫొటోలు, ఇతర ఫైళ్లు స్టోర్‌ చేసుకోవటానికి  వాడుకోవచ్చు. అయితే కేవలం స్టోరేజ్‌ కోసమే వాడుకుంటామంటే కుదరదు. ఎక్కువకాలం వాడకపోయినట్టయితే గూగుల్‌ ఖాతాను డిలిట్‌ చేసేస్తుంది. అందువల్ల కంటెంట్‌ బ్యాకప్‌ కోసం రెండో ఖాతాను వాడుతుంటే తరచూ మెయిల్‌ను తెరచి, చూసుకోవటం మంచిది. రెండో ఖాతాను జొమాటో, స్విగ్గీ వంటి ఇతరత్రా సేవల కోసమూ వినియోగించుకోవచ్చు. దీంతో చికాకు పరచే యాడ్స్‌ మెయిళ్ల బెడదను తగ్గించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని