ట్విటర్‌ డీఎంలో మాట సందేశం

అభిప్రాయాలను పంచుకోవటానికైనా, ఏదైనా ప్రకటించాలన్నా ఇప్పుడు చాలామంది ట్విటర్‌నే ఆశ్రయిస్తున్నారు. ఇలా ట్వీట్ల ద్వారా బహిరంగ చర్చల పరంపరకే కాదు.. వ్యక్తిగతంగా సందేశాలను పంపుకోవటానికీ ట్విటర్‌లో డైరెక్ట్‌ మెసేజ్‌ (డీఎం)

Published : 02 Feb 2022 01:14 IST

అభిప్రాయాలను పంచుకోవటానికైనా, ఏదైనా ప్రకటించాలన్నా ఇప్పుడు చాలామంది ట్విటర్‌నే ఆశ్రయిస్తున్నారు. ఇలా ట్వీట్ల ద్వారా బహిరంగ చర్చల పరంపరకే కాదు.. వ్యక్తిగతంగా సందేశాలను పంపుకోవటానికీ ట్విటర్‌లో డైరెక్ట్‌ మెసేజ్‌ (డీఎం) సదుపాయమూ ఉంది. దీంతో టెక్స్ట్‌ మెసేజ్‌లే కాదు.. వాయిస్‌ మెసేజ్‌లనూ పంపుకోవచ్చని తెలుసా? మనం ఫాలో అయినా కాకపోయినా, మనల్ని ఫాలో అయినా కాకపోయినా ఎవరికైనా దీని ద్వారా ఆడియో మెసేజ్‌ పంపించుకోవచ్చు. అయితే అవతలివారు డీఎం ఫీచర్‌ను ఓపెన్‌ చేసి ఉండాలి. ఈ సదుపాయం ట్విటర్‌ యాప్‌లోనే అందుబాటులో ఉంటుంది. డెస్క్‌టాప్‌కు ఇంకా విస్తరించలేదు. దీన్ని వాడుకోవాలంటే..

ముందుగా ట్విటర్‌ యాప్‌ను తెరవాలి. అడుగున కుడివైపున కనిపించే డీఎం గుర్తు (ఎన్వలప్‌) మీద నొక్కాలి.

తర్వాత అడుగున కుడివైపు మూలన కనిపించే ‘న్యూ మెసేజ్‌’ గుర్తును క్లిక్‌ చేయాలి.

ఆడియో మెసేజ్‌ పంపాలని అనుకుంటున్నవారిని సెర్చ్‌ చేసి, ఎంచుకోవాలి.

టెక్స్ట్‌ బార్‌ పక్కన ఉండే ‘వాయిస్‌ రికార్డింగ్‌’ గుర్తును క్లిక్‌ చేసి, అలాగే నొక్కి పట్టుకోవాలి.

అప్పుడు ఆడియోను రికార్డు చేయటానికి ట్విటర్‌ అనుమతి కోరుతుంది. దీనికి అనుమతించిన తర్వాత వాయిస్‌ రికార్డు అవటం మొదలవుతుంది. ఒకో మెసేజ్‌ను సుమారు 140 సెకండ్ల వరకు రికార్డు చేసుకోవచ్చు.

రికార్డు పూర్తయ్యాక వాయిస్‌ రికార్డింగ్‌ బటన్‌ మీది నుంచి వేలిని తీసేయాలి.

కావాలనుకుంటే టెక్స్ట్‌ బార్‌లో కనిపించే ఆడియో మెసేజ్‌ను ఒకసారి వినొచ్చు. ఎలా రికార్డు అయ్యిందో తెలుసుకోవచ్చు. బాగా లేదనుకుంటే క్యాన్సల్‌ చేసుకొని, తిరిగి రికార్డు చేసుకోవచ్చు.

బాగా రికార్డు అయ్యిందనుకుంటే ఆడియో క్లిప్‌ పక్కన కనిపించే బాణం గుర్తును క్లిక్‌ చేసి, సెండ్‌ చేసుకోవాలి. సెండ్‌ చేశాకా మెసేజ్‌ను వినొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని