మెయిల్‌ లేబుళ్లకు రంగులు!

ఈమెయిళ్లను వర్గీకరించుకోవటానికి లేబుళ్లు బాగా ఉపకరిస్తాయి. జీమెయిల్‌ వాడేవారికిది సుపరిచితమే. మరి లేబుళ్లను రంగులతో సింగారించుకుంటే? ఇంకా ఆకర్షణీయంగానూ కనిపిస్తాయి.

Published : 23 Feb 2022 01:11 IST

మెయిళ్లను వర్గీకరించుకోవటానికి లేబుళ్లు బాగా ఉపకరిస్తాయి. జీమెయిల్‌ వాడేవారికిది సుపరిచితమే. మరి లేబుళ్లను రంగులతో సింగారించుకుంటే? ఇంకా ఆకర్షణీయంగానూ కనిపిస్తాయి. ఆయా మెయిళ్లను చూడగానే పసిగట్టటానికిది తోడ్పడుతుంది. లేబుళ్లకు రంగులద్దుకోవటం చాలా తేలిక. కాకపోతే ఇది జీమెయిల్‌ వెబ్‌లోనే అందుబాటులో ఉంటుంది.

* ముందుగా జీమెయిల్‌ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావాలి.

* ఎడమ వైపు సైడ్‌ బార్‌లో కనిపించే లేబుళ్ల మీద కర్సర్‌ పెట్టాలి. అప్పుడు పక్కన నిలువు మూడు గీతల మెనూ కనిపిస్తుంది. దీనిపై క్లిక్‌ చేయాలి.

* ‘లేబుల్‌ కలర్‌’ ఆప్షన్‌ ద్వారా రంగు ఎంచుకోవాలి. అందులో అందుబాటులో ఉన్న రంగును ఎంచుకోవచ్చు. కావాలనుకుంటే ‘యాడ్‌ కస్టమ్‌ కలర్‌’ ఆప్షన్‌తో ఇష్టమైన రంగు జోడించుకోవచ్చు.

చదవని మెసేజ్‌లు ఎన్ని?

రోజూ ఎన్నో మెయిళ్లు వస్తుంటాయి. వాటన్నింటినీ చదవటం కుదరకపోవచ్చు. ఇలాంటి చదవని మెయిళ్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవటానికీ గూగుల్‌ క్రోమ్‌లో మంచి ఫీచర్‌ అందుబాటులో ఉంది.

* గూగుల్‌ క్రోమ్‌లో జీమెయిల్‌ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావాలి.

* కుడి వైపున కనిపించే సెటింగ్స్‌ గుర్తు మీద నొక్కి ‘సీ ఆల్‌ సెటింగ్స్‌’ను క్లిక్‌ చేయాలి.

* అడ్వాన్స్‌డ్‌ సెక్షన్‌లోకి వెళ్లి, కిందికి స్క్రోల్‌ చేస్తే ‘అన్‌రీడ్‌ మెసేజెస్‌’ గుర్తు కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్‌ చేసుకోవాలి.

* ‘సేవ్‌ ఛేంజెస్‌’ను నొక్కగానే జీమెయిల్‌ రిఫ్రెష్‌ అవుతుంది.

* చదవని ఈమెయిళ్లు ఉన్నట్టయితే పైన ఎడమవైపున క్రోమ్‌ ట్యాబ్‌ మీద చిన్నగా ఒక సంఖ్య కనిపిస్తుంది. దీని ద్వారా తెరవని మెయిళ్ల సంఖ్య ఇట్టే తెలుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని