మాటలతోనే టైపింగ్‌!

రాయటానికి సమయం లేదు. చేతికి ఏదో దెబ్బ తగలటం వల్ల రాయలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో వాయిస్‌ టైపింగ్‌ సదుపాయాన్ని వాడుకోవచ్చు.

Updated : 02 Mar 2022 06:23 IST

రాయటానికి సమయం లేదు. చేతికి ఏదో దెబ్బ తగలటం వల్ల రాయలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో వాయిస్‌ టైపింగ్‌ సదుపాయాన్ని వాడుకోవచ్చు. ఇది మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌, గూగుల్‌ డాక్స్‌ రెండింటిలోనూ అందుబాటులో ఉంది వర్డ్‌లో దీన్ని ఎనేబుల్‌ చేసుకోవాలంటే హోం మెనూలోంచి డిక్టేషన్‌ ఆప్షన్‌ను ఎంచుకుంటే సరి. విండోస్‌ కీ, హెచ్‌ కీ.. రెండింటినీ కలిపి నొక్కినా డిక్టేషన్‌ టూల్‌బార్‌ కనిపిస్తుంది. తర్వాత మైక్‌ మీద క్లిక్‌ చేసి ఇంగ్లిషులో మాట్లాడితే చాలు. టెక్ట్స్‌ ఇంగ్లిషులో టైప్‌ అవుతుంది. విరామ చిహ్నాలు జతచేయాలంటే వాటిని స్పష్టంగా పలకాల్సి ఉంటుంది. గూగుల్‌ డాక్స్‌లో కూడా టూల్స్‌ మెనూలోకి వెళ్లి, వాయిస్‌ టైపింగ్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. అనంతరం మైక్‌ను ఎంచుకొని మాట్లాడితే టైప్‌ అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు