వాట్సప్‌ వెబ్‌ మరింత భద్రం

బ్రౌజర్‌ ద్వారా వాట్సప్‌ వెబ్‌ను వాడేవారి కోసం కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. దీని పేరు కోడ్‌ వెరిఫై. ఇదో వెబ్‌ ఎక్స్‌టెన్షన్‌. గూగుల్‌ క్రోమ్‌, మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌, ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్లకు అందుబాటులోకి రానుంది. వాట్సప్‌ వెబ్‌ కోడ్‌తో లాగిన్‌ అయినప్పుడు

Updated : 16 Mar 2022 16:10 IST

బ్రౌజర్‌ ద్వారా వాట్సప్‌ వెబ్‌ను వాడేవారి కోసం కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. దీని పేరు కోడ్‌ వెరిఫై. ఇదో వెబ్‌ ఎక్స్‌టెన్షన్‌. గూగుల్‌ క్రోమ్‌, మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌, ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్లకు అందుబాటులోకి రానుంది. వాట్సప్‌ వెబ్‌ కోడ్‌తో లాగిన్‌ అయినప్పుడు అది ప్రామాణికమైదేనా? కాదా? అనే విషయాన్ని ఇది ధ్రువీకరిస్తుంది. ఎవరైనా హ్యాకర్లు కోడ్‌ను మార్చితే హెచ్చరిస్తుంది. దీంతో వాట్సప్‌ వాడకం మరింత సురక్షితం కానుంది. ఒకేసారి వివిధ పరికరాల్లో వాట్సప్‌ను వాడుకోవటం గత సంవత్సరం అందుబాటులోకి వచ్చింది. దీంతో వాట్సప్‌ వెబ్‌ వాడకం బాగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో భద్రత కోసం కోడ్‌ వెరిఫై ఎక్స్‌టెన్షన్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. దీన్ని యాడ్‌ చేసుకుంటే బ్రౌజర్‌లో ఒదిగి పోతుంది. వెబ్‌ భద్రత సంస్థ క్లౌడ్‌ఫేర్‌తో కలిసి పనిచేస్తుంది. వాట్సప్‌ కోడ్‌ పూర్తిగా నమ్మదగినదే అయితే ఇది ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. ఒకవేళ నారింజ రంగులోకి మారితే పేజీని రిఫ్రెష్‌ చేయాలని, లేదా కోడ్‌ వెరిఫైతో మరో ఎక్స్‌టెన్షన్‌ జోక్యం చేసుకుంటోందని అర్థం. ఇలాంటి సమయంలో ఇతర బ్రౌజర్‌ ఎక్స్‌టెన్షన్లను పాజ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అదే కోడ్‌ వెరిఫై ఎరుపు రంగులో ఉన్నట్టయితే మనకు అందిన వాట్సప్‌ వెబ్‌ కోడ్‌ విషయంలో భద్రత పరంగా ఏదో సమస్య ఉందని అనుకోవచ్చు. ఇది ఎలాంటి సమాచారాన్ని నిల్వ చేసుకోదు. వాట్సప్‌తో ఎలాంటి సమాచారాన్నీ షేర్‌ చేసుకోదు. మెసేజ్‌లను చదవదు. ఎవరెవరు కోడ్‌ వెరిఫై ఎక్స్‌టెన్షన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారనే సమాచారాన్ని సైతం వాట్సప్‌కు ఇవ్వదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని