త్వరలో వాట్సప్‌లో 2జీబీ ఫైళ్ల షేరింగ్‌

వాట్సప్‌లో పెద్ద మీడియా ఫైళ్లను షేర్‌ చేసుకోవాలనుకునేవారి కల త్వరలో తీరనుంది. త్వరలో 2జీబీ సైజు వరకు ఫైళ్లు పంపుకోవటానికి వీలు కల్పించే కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.

Published : 30 Mar 2022 00:20 IST

వాట్సప్‌లో పెద్ద మీడియా ఫైళ్లను షేర్‌ చేసుకోవాలనుకునేవారి కల త్వరలో తీరనుంది. త్వరలో 2జీబీ సైజు వరకు ఫైళ్లు పంపుకోవటానికి వీలు కల్పించే కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ రెండు పరికరాల్లోనూ పనిచేసే దీని బీటా వర్షన్‌ను అర్జెంటీనాలో పరీక్షించటం ఆరంభమైంది. త్వరలో మిగతా ప్రాంతాలకూ విస్తరించొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం వాట్సప్‌లో 100ఎంబీ వరకే మీడియా ఫైళ్లను షేర్‌ చేసుకోవటానికి వీలుంది. పెద్ద సైజులోని అధిక రెజల్యూషన్‌ ఫొటోలు, వీడియోలు పంపించుకోవాలని అనుకునేవారికిది ఇబ్బందికరంగా మారింది. మామూలుగానే వాట్సప్‌తో ఫొటోలు, వీడియోలు పంపేటప్పుడు అవి కంప్రెస్‌ అవుతాయి. పరిమితికి మించిన వీడియోలనైతే యాప్‌లో కట్‌ చేసి పంపుకోవాల్సి వస్తుంది. లేదూ ఇన్‌యాప్‌లో గానీ థర్డ్‌పార్టీ యాప్‌లతో గానీ ఎడిట్‌ చేసి షేర్‌ చేసుకోవాల్సిందే. దీంతో వీడియో నాణ్యత తగ్గిపోతుంది. కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వస్తే ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. నాణ్యత ఏమాత్రం తగ్గకుండానే 2జీబీ సైజు వరకు మీడియా ఫైళ్లు పంపుకోవటానికి మార్గం సుగమమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని