ట్విటర్‌లో అన్‌మెన్షన్‌!

ట్విటర్‌లో ట్వీట్ల మాల (త్రెడ్‌) రూపంలో సుదీర్ఘ చర్చలు సాగుతుండటం తెలిసిందే. వీటికి కొందరు ఇతరుల యూజర్‌ నేమ్స్‌ను ట్యాగ్‌ చేస్తుంటారు కూడా. అయితే కొన్నిసార్లు ఇలాంటి చర్చల్లో భాగస్వాములు....

Published : 27 Apr 2022 01:55 IST

ట్విటర్‌లో ట్వీట్ల మాల (త్రెడ్‌) రూపంలో సుదీర్ఘ చర్చలు సాగుతుండటం తెలిసిందే. వీటికి కొందరు ఇతరుల యూజర్‌ నేమ్స్‌ను ట్యాగ్‌ చేస్తుంటారు కూడా. అయితే కొన్నిసార్లు ఇలాంటి చర్చల్లో భాగస్వాములు కావటం నచ్చకపోవచ్చు. ట్యాగ్‌ అయిన వారి జాబితాలోంచి వైదొలిగితే బాగుంటుందని అనిపించొచ్చు. ఇప్పటివరకూ దీనికి వీలుండేది కాదు కానీ తాజాగా ట్విటర్‌ ఇందుకోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. దీని పేరు ‘అన్‌మెన్షన్‌’. ప్రస్తుతం దీన్ని ప్రపంచవ్యాప్తంగా పరీక్షిస్తున్నారు. దీంతో నచ్చని చర్చల్లో భాగస్వాములు కాకుండా చూసుకోవచ్చు. ఇది అందుబాటులోకి వస్తే థ్రెడ్‌లో రిప్లయ్‌ ట్వీట్‌ ఆప్షన్‌ పక్కన కనిపించే మూడుచుక్కల మెనూలో ‘గెట్‌ అవుట్‌ ఆఫ్‌ దిస్‌ కన్వర్జేషన్‌’ ఫీచర్‌ కనిపిస్తుంది. దీన్ని ఎంచుకుంటే యూజర్‌ నేమ్‌ అదృశ్యం కాదు గానీ అది బూడిద రంగులోకి మారుతుంది. దీని ద్వారా ఆయా చర్చల్లో పాల్గొనటం మనకు ఇష్టం లేదనే నచ్చలేదనే సందేశాన్ని ఇవ్వచ్చు. అంతేకాదు.. ఆయా చర్చలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా మనకు అందవు. ట్విటర్‌ దుర్వినియోగాన్ని తగ్గించే ప్రయత్నంలో ఇటీవల చాలా మార్పులు తీసుకొస్తున్నారు. ఇప్పటికే సేఫ్టీ మోడ్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇది చర్చలను విశ్లేషించి, వేధించే ఖాతాలను బ్లాక్‌ చేసేస్తుంది. అన్‌మెన్షన్‌ ఫీచర్‌ కూడా తోడైతే మరింత మంచి ఫలితముంటుందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని