ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నిమిషం మ్యూజిక్‌!

ఇన్‌స్టాగ్రామ్‌ ట్రెండ్స్‌ విషయంలో సంగీతం పెద్ద ఆకర్షణగా నిలుస్తోంది. నిజానికి మ్యూజిక్, ఆర్టిస్టులను వెతకటానికి రీల్స్‌ మంచి వేదికగా మారుతోంది కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కొత్తగా ‘1 మినిట్‌ మ్యూజిక్‌’ ఫీచర్‌ను ఆరంభించింది.

Updated : 01 Jun 2022 03:05 IST

ఇన్‌స్టాగ్రామ్‌ ట్రెండ్స్‌ విషయంలో సంగీతం పెద్ద ఆకర్షణగా నిలుస్తోంది. నిజానికి మ్యూజిక్, ఆర్టిస్టులను వెతకటానికి రీల్స్‌ మంచి వేదికగా మారుతోంది కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కొత్తగా ‘1 మినిట్‌ మ్యూజిక్‌’ ఫీచర్‌ను ఆరంభించింది. ఇందులో ఇన్‌స్టాగ్రామ్‌కే ప్రత్యేకమైన తక్కువ నిడివి మ్యూజిక్‌ ట్రాక్స్, వీడియోలు దర్శనమిస్తాయి. దీంతో రీల్‌ మరింత జనరంజకంగా మారనుంది. వర్ధమాన కళాకారులు తమ సంగీతాన్ని షేర్‌ చేసుకోవటానికి, వీడియోలను సృష్టించుకోవటానికీ ఇది వీలు కల్పిస్తుంది. ఇతర కళాకారులు తమ స్వల్ప నిడివి ట్రాక్‌లను ఇందులో విడుదల చేసుకునేలా స్ఫూర్తిని ఇస్తుందని భావిస్తున్నారు. ‘1 మినిట్‌ మ్యూజిక్‌’ ఫీచర్‌లో వివిధ ప్రాంతాలకు చెందిన ధ్వని భానుశాలి, నీతి మోహన్‌ వంటి 200 మంది కళాకారుల ట్రాక్‌లు ఉన్నాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని