త్వరలో టెలిగ్రామ్‌ ప్రీమియం!

మరింత భద్రత, మరింత గోప్యత. నిర్ణీత కాలం తర్వాత డిలీట్‌ అయ్యే మెసేజ్‌లు. ఇలాంటి ఫీచర్ల మూలంగానే చాలామంది టెలిగ్రామ్‌ వైపు ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతానికి దీన్ని ఉచితంగానే...

Published : 15 Jun 2022 00:20 IST

రింత భద్రత, మరింత గోప్యత. నిర్ణీత కాలం తర్వాత డిలీట్‌ అయ్యే మెసేజ్‌లు. ఇలాంటి ఫీచర్ల మూలంగానే చాలామంది టెలిగ్రామ్‌ వైపు ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతానికి దీన్ని ఉచితంగానే వాడుకుంటున్నాం గానీ మున్ముందు డబ్బులు చెల్లించాల్సి రావొచ్చు. త్వరలో ‘టెలిగ్రామ్‌ ప్రీమియం’ సర్వీసు ఆరంభం కానుంది మరి. అంటే ఒకవేళ ఉచితంగా వాడుకోవాలనుకుంటే కొన్ని ప్రకటనల బెడద తప్పదన్నమాట. ఇవి 160 అక్షరాలతో కూడిన చిన్న ప్రకటనల మాదిరిగా ఉంటాయని టెలిగ్రామ్‌ పేర్కొంటోంది. బయటి లింకులేవీ ఉండవు. ఇప్పటికైతే ప్రీమియం సేవలను అధికారికంగా ప్రకటించలేదు గానీ త్వరలో ఆరంభమయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో పెద్ద ఫైళ్లను (4జీబీ) అప్‌లోడ్‌ చేయటం, మరింత వేగంగా డౌన్‌లోడ్‌ చేసుకోవటం, మాటలను టెక్ట్స్‌ రూపంలోకి మార్చుకోవటం, ప్రొఫైల్‌ బ్యాడ్జ్‌, యానిమేటెడ్‌ అవతార్ల వంటి అదనపు ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం టెలిగ్రామ్‌ ప్రీమియం సదుపాయం ఆండ్రాయిడ్‌ పరికరాలు వాడేవారికి బీటా వర్షన్‌లో అందుబాటులో ఉంది. కానీ ఇంకా సబ్‌స్క్రయిబ్‌ చేసుకోవటానికి లేదు. ప్రీమియం చందా దారులకు స్టార్‌ బ్యాడ్జ్‌ ఇస్తున్నట్టు ఐఓఎస్‌ బీటా వర్షన్‌లో కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని