మాట స్టేటస్‌

వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలను స్టేటస్‌గా పెట్టుకోవటం తెలిసిందే. ఇకపై మాటలు, పాటలనూ స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. ఇందుకోసం వాట్సప్‌ ప్రయత్నాలు చేస్తోంది. బీటా వర్షన్‌లో దీన్ని పరీక్షిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే వాయిస్‌ నోట్‌నూ స్టేటస్‌గా సెట్‌ చేసుకోవచ్చు. మన ఫొటోలు,

Updated : 12 Aug 2022 14:32 IST

వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలను స్టేటస్‌గా పెట్టుకోవటం తెలిసిందే. ఇకపై మాటలు, పాటలనూ స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. ఇందుకోసం వాట్సప్‌ ప్రయత్నాలు చేస్తోంది. బీటా వర్షన్‌లో దీన్ని పరీక్షిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే వాయిస్‌ నోట్‌నూ స్టేటస్‌గా సెట్‌ చేసుకోవచ్చు. మన ఫొటోలు, వీడియోలను చూడటానికి అనుమతించినవారికే ఇది కనిపిస్తుంది. స్టేటస్‌ విభాగంలో ఫొటో, పెన్సిల్‌ గుర్తుతో పాటు మున్ముందు మైక్‌ గుర్తునూ జోడించనున్నారు. దీని ద్వారా మనం చెప్పదలచుకున్న విషయాన్ని రికార్డు చేసి స్టేటస్‌గా పెట్టుకోవచ్చు.

ఎక్కువగా ఎవరితో ఛాట్‌ చేశారు?

యాప్‌తో వాడుకున్న మొత్తం డేటాను వాట్సప్‌ ఆయా కాంటాక్టుల వారీగా నమోదు చేస్తుంది. దీని ద్వారా ఎవరితో ఎక్కువగా ఛాట్‌ చేశామో తెలుసుకోవచ్చు. వాట్సప్‌లో సెటింగ్స్‌ ద్వారా స్టోరేజ్‌ అండ్‌ డేటాలోకి వెళ్తే మేనేజ్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీన్ని క్లిక్‌ చేస్తే ఎవరితో ఎక్కువగా ఛాట్‌ చేశామో తెలుస్తుంది. టెక్స్ట్‌, జిఫ్‌ల కన్నా ఫొటోలు, వీడియోలు ఎక్కువ డేటాను తీసుకుంటాయి. కాబట్టి ఎవరితోనైనా ఎక్కువగా టెక్స్ట్‌తో ఛాట్‌ చేసినా కూడా ఎక్కువ ఫొటోలను షేర్‌ చేసినవారి పేరు అందరికన్నా పైన కనిపిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు