షార్ట్స్‌ డౌన్‌లోడ్‌ ఇలా..

టిక్‌టాక్‌ వీడియోలకు పోటీగా వచ్చిన యూట్యూబ్‌ షార్ట్స్‌ అనతికాలంలోనే ఆదరణ పొందాయి. వీటిల్లో కొన్ని మళ్లీ మళ్లీ చూడాలని అనిపించేలా ఉంటాయి కూడా. వీటిని డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఫోన్‌లో ఎప్పుడైనా, ఎక్కడైనా చూసుకోవచ్చు. ఇందుకు ఆండ్రాయిడ్‌ ఫోన్లలోని యూట్యూబ్‌లో ‘ఇన్‌-యాప్‌ ఫీచర్‌

Updated : 20 Jul 2022 03:07 IST

టిక్‌టాక్‌ వీడియోలకు పోటీగా వచ్చిన యూట్యూబ్‌ షార్ట్స్‌ అనతికాలంలోనే ఆదరణ పొందాయి. వీటిల్లో కొన్ని మళ్లీ మళ్లీ చూడాలని అనిపించేలా ఉంటాయి కూడా. వీటిని డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఫోన్‌లో ఎప్పుడైనా, ఎక్కడైనా చూసుకోవచ్చు. ఇందుకు ఆండ్రాయిడ్‌ ఫోన్లలోని యూట్యూబ్‌లో ‘ఇన్‌-యాప్‌ ఫీచర్‌’ ఉపయోగపడుతుంది.

యూట్యూబ్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి, ఇష్టమైన షార్ట్‌ వీడియోను చూసుకోవాలి.

* కింద ఎడమవైపు మూలన కనిపించే ‘ఛానెల్‌ గుర్తు’ మీద తట్టాలి.

* అనంతరం యూట్యూబ్‌ ఛానెల్‌ పేరు మీద ట్యాప్‌ చేసి, వీడియోస్‌ విభాగానికి వెళ్లాలి.  

* అక్కడ ఇష్టమైన వీడియోను గుర్తించి, దాని పక్కన మూడు నిలువు చుక్కల మీద ట్యాప్‌ చేయాలి. ఇందులో ‘డౌన్‌లోడ్‌ వీడియో’ ఆప్షన్‌ను ఎంచుకొని, సేవ్‌ చేసుకోవాలి.

* యూట్యూబ్‌ యాప్‌లో అడుగున కుడివైపున ఉండే ‘లైబ్రరీ’లోని ‘డౌన్‌లోడ్స్‌’ విభాగంలోకి వెళ్తే, డౌన్‌లోడ్‌ చేసిన వీడియో కనిపిస్తుంది.

* గమనించాల్సిన విషయం ఏంటంటే- డౌన్‌లోడ్‌ అయిన వీడియోలు కేవలం యూట్యూబ్‌ యాప్‌లోనే ప్లే అవుతాయి. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకపోతే 29 రోజుల వరకే ఉంటాయి. తర్వాత వాటంతటవే తొలగిపోతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని