బ్రౌజర్‌లో టెలిగ్రామ్‌

తక్షణం సందేశాలను, ఫైళ్లను పంపుకోవటానికి తోడ్పడే టెలిగ్రాం మెసెంజర్‌కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. వాట్సప్‌ వినియోగదారులతో పోలిస్తే దీన్ని వాడేవారి సంఖ్య తక్కువే అయినా ఫీచర్ల విషయంలో తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే వాట్సప్‌లో లేని ప్రత్యేక ఫీచర్లూ ఉన్నాయి.

Published : 27 Jul 2022 00:24 IST

తక్షణం సందేశాలను, ఫైళ్లను పంపుకోవటానికి తోడ్పడే టెలిగ్రాం మెసెంజర్‌కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. వాట్సప్‌ వినియోగదారులతో పోలిస్తే దీన్ని వాడేవారి సంఖ్య తక్కువే అయినా ఫీచర్ల విషయంలో తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే వాట్సప్‌లో లేని ప్రత్యేక ఫీచర్లూ ఉన్నాయి. చాలావరకు టెలిగ్రాం మెసెంజర్‌ను యాప్‌ రూపంలోనే వాడుతుంటాం. కొన్నిసార్లు దీన్ని ఫోన్‌లో వాడుకోవటానికి ఇష్టం ఉండకపోవచ్చు. మరెలా? వెబ్‌ సదుపాయం ఉందిగా. అవును.. వాట్సప్‌ మాదిరిగానే దీన్ని కూడా వెబ్‌లో వాడుకోవచ్చు. ఇందుకోసం..
* ముందుగా ‌web.telegram.org లోకి వెళ్లాలి.
* ‘లాగ్‌ ఇన్‌ బై ఫోన్‌ నంబరు’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* దేశాన్ని ఎంచుకొని, ఫోన్‌ నంబరును ఎంటర్‌ చేయాలి.
* ఫోన్‌ నంబరు టైప్‌ చేశాక ‘నెక్స్ట్‌’ బటన్‌ను క్లిక్‌ చేయాలి.
* అప్పుడు టెలిగ్రామ్‌ వెబ్‌ నుంచి నమోదు చేసుకున్న ఫోన్‌ నంబరుకు ఒక కోడ్‌ వస్తుంది. దీన్ని సంబంధిత బాక్సులో ఎంటర్‌ చేయాలి. ఒకవేళ టూ స్టెప్‌ అథెంటికేషన్‌ను ఎనేబుల్‌ చేసుకొన్నట్టయితే పాస్‌వర్డ్‌ను కూడా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.
* ఆ వెంటనే టెలిగ్రామ్‌ మెసెంజర్‌ బ్రౌజర్‌లో ఓపెన్‌ అవుతుంది. తర్వాత ఇష్టమున్నట్టు వాడుకోవచ్చు.


క్యూఆర్‌ కోడ్‌తోనూ..

* ఫోన్‌లో టెలిగ్రామ్‌ యాప్‌ సెటింగ్స్‌లోకి వెళ్లాలి.
డివైసెస్‌ విభాగాన్ని ఎంచుకోవాలి.
* ‘లింక్‌ డెస్క్‌టాప్‌ డివైస్‌’ను సెలెక్ట్‌ చేసుకోవాలి.
*web.telegram.org మీద కనిపించే క్యూర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. టూ స్టెప్‌ అథెంటికేషన్‌ను ఎనేబుల్‌ చేసుకొని ఉంటే టెలిగ్రామ్‌ వెబ్‌సైట్‌లో పాస్‌వర్డ్‌నూ ఎంటర్‌ చేయాలి.
* ఆ తర్వాత వెబ్‌లో టెలిగ్రామ్‌ ఓపెన్‌ అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని