Published : 27 Jul 2022 00:44 IST

వర్డ్‌లీ మాదిరి వినోదం

అనతికాలంలోనే వర్డ్‌లీ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. దీని స్ఫూర్తితో వివిధ రకాల పజిళ్లూ పుట్టుకొచ్చాయి. ఇవి కాలక్షేపం కోసమే కాదు, విజ్ఞానాన్ని పెంచుకోవటానికీ తోడ్పడతాయి. అలాంటి కొన్నింటిని చూద్దాం.


వరల్డ్‌లీ

పేరుకు తగ్గట్టుగానే ఇది ప్రపంచ దేశాలకు సంబంధించిన పజిల్‌. నల్లరంగులో కనిపించే దేశం ఆకారాన్ని బట్టి ఆరు ప్రయత్నాల్లో పేరును అంచనా వేయాలి. అంచనా వేసిన ప్రతిసారీ సరైన సమాధానానికి ఎంత దూరంలో ఉన్నారో వరల్డ్‌లీ చెబుతుంది. క్యూల ఆధారంగా సరిగా అంచనా వేయొచ్చు.


నెర్డ్‌లీ

గణితం ఇష్టపడేవారికిది బాగా నచ్చుతుంది. ఇందులో లెక్కను అంచనా వేస్తూ పజిల్‌ను పూరించాల్సి ఉంటుంది. సరైన అంచనా అయితే బాక్సు ఆకుపచ్చగా అవుతుంది. తప్పుడు అంచనా అయితే నల్లగా మారుతుంది. లెక్కలో భాగమే అయినా మనం వేసిన అంకె సరైన స్థానంలో లేకపోతే ఆ బాక్సు వంకాయ రంగులోకి మారుతుంది. లెక్కలు ఇష్టం లేనివారికీ ఇది మంచి వినోదం కలిగిస్తుంది.


హియర్డ్‌లీ

ఇది సంగీతం అంటే చెవి కోసుకునేవారి కోసం ఉద్దేశించింది. ఇందులో ఒక సెకను క్లిప్‌ ద్వారా సరైన పాటను అంచనా వేయాల్సి ఉంటుంది మరి. ఒకవేళ తప్పుడు సమాధానమైతే మరిన్ని క్లిప్‌లు అందిస్తుంది. కళాకారుడిని సరిగ్గా గుర్తిస్తున్నకొద్దీ దీనిలోని ఆటోఫిల్‌ ఫీచర్‌ సమాధానాన్ని త్వరగా అంచనా వేయటానికి తోడ్పడుతుంది.


ఫ్రేమ్‌డ్‌

సినిమా ప్రియులకు నచ్చే పజిల్‌ ఇది. మూవీ స్టిల్‌ ఆధారంగా ఆరు ప్రయత్నాల్లో సినిమాను గుర్తించటం ఇందులోని కీలకాంశం. తప్పుగా అంచనా వేసిన ప్రతిసారీ అదనపు ఫ్రేమ్‌ కనిపిస్తుంది. ఇలా సరైన సమాధానాన్ని గుర్తించటానికి సాయం చేస్తుంది.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts