Published : 27 Jul 2022 00:44 IST

అవుట్‌లుక్‌ మెయిల్‌ అవుట్‌బాక్స్‌లోనే ఉంటే?

కంపెనీలు, సంస్థలు ఎక్కువగా వాడే ఈమెయిళ్లలో మైక్రోసాఫ్ట్‌ అవుట్‌లుక్‌ ఒకటి. విశ్వసనీయమైంది కావటంతో  చాలా సంస్థలు దీన్నే వాడుతుంటాయి. అవుట్‌లుక్‌ వాడేవారు చేసే ఫిర్యాదుల్లో ప్రధానమైంది అవుట్‌బాక్స్‌లో మెయిళ్లు నిలిచిపోతున్నాయని. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. మరి దీన్ని పరిష్కరించుకోవటమెలా?
అటాచ్‌మెంట్‌ సైజు మరీ పెద్దగా లేకుండా..
అవుట్‌బాక్స్‌లో మెయిళ్లు నిలిచిపోవటానికి ప్రధాన కారణం అటాచ్‌మెంట్ల సైజు చాలా పెద్దగా ఉండటం. కాబట్టి వీటి సైజు పెద్దగా ఉంటే తగ్గించుకోవాలి. కావాలంటే ఒకే మెయిల్‌లో కాకుండా పలు మెయిళ్లలో పంపించుకోవాలి. అవసరమనుకుంటే అటాచ్‌మెంట్‌ను తొలగించుకోవచ్చు. డ్రాఫ్ట్స్‌ ఫోల్డర్‌లోకి మెయిల్‌ను మూవ్‌ చేసి, అటాచ్‌మెంట్‌ మీద క్లిక్‌ చేయాలి. తర్వాత రిమూవ్‌ ఆప్షన్‌ ద్వారా తొలగించుకోవచ్చు.
ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ అయ్యేలా..
అవుట్‌లుక్‌ ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు పంపించిన మెయిళ్లన్నీ అవుట్‌బాక్స్‌లోనే ఉండిపోతాయి. కాబట్టి అవుట్‌లుక్‌ ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ అయ్యిందో లేదో చూసుకోవాలి. తెర కింద స్టేటస్‌ బార్‌లో ఇది కనిపిస్తుంది. ‘కనెక్టెడ్‌ టు: మైక్రోసాఫ్ట్‌ ఎక్స్‌ఛేంజ్‌’ అని కనిపిస్తే ఎలాంటి సమస్య  లేదని అర్థం. ‘డిస్‌కనెక్టెడ్‌’ లేదా ‘ట్రైయింగ్‌ టు కనెక్ట్‌’ అని కనిపిస్తే ఇంటర్నెట్‌ కనెక్షన్‌ను ఓసారి చెక్‌ చేసుకోవాలి.
డిలే సెటింగ్స్‌ తనిఖీతో..
కొన్నిసార్లు నిర్ణీత కాలానికి ఈమెయిల్‌ సెండ్‌ కావాలని సెట్‌ చేసుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో మెయిల్‌ను పంపించినా అది అవుట్‌బాక్స్‌లోనే ఉండిపోతుంది. నిర్ణీత సమయం తర్వాతే సెండ్‌ అవుతుంది. ఒకవేళ వెంటనే మెయిల్‌ను పంపాలని అనుకున్నట్టయితే అకౌంట్‌లోకి వెళ్లి, డిలే సెటింగ్స్‌ను తనిఖీ చేసుకోవాలి.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts