మ్యాప్‌మైఇండియా 360 డిగ్రీ పటాలు

అధునాతన డిజిటల్‌ మ్యాప్స్‌ సేవలందించే మ్యాప్‌మైఇండియా మరో ముందడుగు వేసింది. మనదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి 360 డిగ్రీ స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌ను ఇటీవల విడుదల చేసింది. 3డీ మెటావర్స్‌ మ్యాప్స్‌ సర్వీస్‌నూ ప్రవేశపెట్టింది.

Published : 03 Aug 2022 00:09 IST

ధునాతన డిజిటల్‌ మ్యాప్స్‌ సేవలందించే మ్యాప్‌మైఇండియా మరో ముందడుగు వేసింది. మనదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి 360 డిగ్రీ స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌ను ఇటీవల విడుదల చేసింది. 3డీ మెటావర్స్‌ మ్యాప్స్‌ సర్వీస్‌నూ ప్రవేశపెట్టింది. ఇదిప్పుడు Mappls.com లో ఉచితంగా అందుబాటులో ఉంది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాలను వినూత్నంగా దర్శించుకోవచ్చు. వివిధ పర్యాటక ప్రాంతాలు, రోడ్లు, ఆయా పట్టణాల్లోని వాణిజ్య ప్రాంతాలను చూడొచ్చు. మ్యాపుల్స్‌కు చెందిన 2డీ మ్యాప్స్‌.. ఇస్రోకు చెందిన ఉపగ్రహ చిత్రాలు, భూ సమాచార డేటా రెండింటినీ జోడించి తాజా సేవలకు శ్రీకారం చుట్టారు. దీంతో చూసేవారికి సమగ్రమైన, మెటావర్స్‌ అనుభూతి కలుగుతుంది. విదేశీ మ్యాప్‌ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఇది మరింత అధునాతన సామర్థ్యాలను కలిగుండటం విశేషం. గూగుల్‌ మ్యాప్స్‌ పదేళ్ల తర్వాత తిరిగి భారత్‌లో స్ట్రీట్‌ వ్యూను ఆరంభించిన తరుణంలోనే ఇదీ అందుబాటులోకి రావటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని