Youtube Shorts: స్మార్ట్ టీవీల్లోనూ యూట్యూబ్ షార్ట్స్!

యూట్యూబ్‌ పొట్టి వీడియో వేదిక షార్ట్స్‌కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. పొట్టి వీడియోల వీక్షణలు రోజుకు 3వేల కోట్లకు చేరుకున్నాయి.

Updated : 01 Sep 2022 07:35 IST

యూట్యూబ్‌ పొట్టి వీడియో వేదిక షార్ట్స్‌కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. పొట్టి వీడియోల వీక్షణలు రోజుకు 3వేల కోట్లకు చేరుకున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే షార్ట్స్‌ను ఆండ్రాయిడ్‌ టీవీలకూ విస్తరించటంపై యూట్యూబ్‌ దృష్టి సారించింది. యూట్యూబ్‌ టీవీ యాప్‌లో త్వరలో షార్ట్స్‌ను ఆరంభించనుంది. ఒకేసారి నాలుగు ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేలా మొజాయిక్‌ మోడ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తేవాలనీ యూట్యూబ్‌ భావిస్తోంది. దీంతో తెర నాలుగు భాగాలుగా విడిపోతుంది. ఒకో భాగంలో ఒకో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని