వాట్సప్‌ గ్రూప్‌ ఛాట్‌లో ప్రొఫైల్‌ ఫొటో

వాట్సప్‌ గ్రూప్‌లో ఛాట్‌ చేస్తుంటాం. వారి కాంటాక్టు నంబర్లు, పేర్లు కనిపిస్తుంటాయి. ప్రొఫైల్‌ ఫొటోలు కూడా కనిపిస్తే బాగుంటుంది కదా. వాట్సప్‌ అభిమానులు చాలాకాలంగా ఇలాంటి ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నారు. త్వరలోనే ఇది సాకారం కానుంది.

Published : 31 Aug 2022 00:26 IST

వాట్సప్‌ గ్రూప్‌లో ఛాట్‌ చేస్తుంటాం. వారి కాంటాక్టు నంబర్లు, పేర్లు కనిపిస్తుంటాయి. ప్రొఫైల్‌ ఫొటోలు కూడా కనిపిస్తే బాగుంటుంది కదా. వాట్సప్‌ అభిమానులు చాలాకాలంగా ఇలాంటి ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నారు. త్వరలోనే ఇది సాకారం కానుంది. ఐమెసేజెస్‌లో మాదిరిగా గ్రూప్‌ ఛాట్స్‌లో ప్రొఫైల్‌ ఫొటోలు కనిపించేలా చేయటంపై వాట్సప్‌ దృష్టి సారించింది. ముందుగా బీటా వర్షన్‌కు అందుబాటులోకి తేనుంది. దీంతో గ్రూపులో ఛాట్‌ చేస్తున్నప్పుడు భాగస్వాములు పంపే మేసేజ్‌ల పక్కనే వారి ప్రొఫైల్‌ పొటోలూ దర్శనమిస్తాయి. ఈ ఫీచర్‌ యాప్‌ అప్‌డేట్‌తో పాటు డిఫాల్ట్‌గానే యాడ్‌ అవుతుంది. అంటే ఎల్లవేళలా ఎనేబుల్‌ అయ్యి ఉంటుంది. డిసేబుల్‌ చేసుకునే అవకాశం ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని