వాట్సప్‌లో స్క్రీన్‌షాట్‌ బ్లాకింగ్‌

వాట్సప్‌ ప్రియులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న స్క్రీన్‌షాట్‌ బ్లాకింగ్‌ ఫీచర్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే బీటా వర్షన్‌లో దీన్ని పరీక్షిస్తున్నారు. వ్యూ-వన్స్‌ మెసేజ్‌లను స్క్రీన్‌షాట్‌ తీయకుండా ఇది అడ్డుకుంటుంది

Published : 05 Oct 2022 00:56 IST

వాట్సప్‌ ప్రియులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న స్క్రీన్‌షాట్‌ బ్లాకింగ్‌ ఫీచర్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే బీటా వర్షన్‌లో దీన్ని పరీక్షిస్తున్నారు. వ్యూ-వన్స్‌ మెసేజ్‌లను స్క్రీన్‌షాట్‌ తీయకుండా ఇది అడ్డుకుంటుంది. అంతేకాదు, వ్యూ-వన్స్‌ వీడియోలను స్క్రీన్‌ రికార్డింగ్‌ చేయటమూ సాధ్యం కాదు. ఒకవేళ స్క్రీన్‌షాట్‌ తీయాలని చూస్తే బ్లాక్‌ స్క్రీన్‌ ప్రత్యక్షమవుతుంది. ‘కాన్ట్‌ టేక్‌ ఎ స్క్రీన్‌షాట్‌ డ్యూ టు సెక్యూరిటీ పాలసీ’ అనే సందేశం కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ కేవలం ఫొటోలు, వీడియోలకే వర్తిస్తుంది. అంటే ఛాట్స్‌, మెసేజ్‌లను మాత్రం స్క్రీన్‌షాట్‌ తీసుకోవచ్చన్నమాట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని