WhatsApp: క్లోన్‌ వాట్సప్‌తో జాగ్రత్త!

వాట్సప్‌ వాడుతున్నారా? అయితే అది అసలైనదో, నకిలీదో ఓసారి చూసుకోండి. ఎందుకంటే ‘జీబీ వాట్సప్‌’ అనే వాట్సప్‌ క్లోన్‌ యాప్‌ మనదేశంలోని వాడకందార్లపై గూఢచర్యం చేస్తున్నట్టు ఈఎస్‌ఈటీ నివేదిక హెచ్చరిస్తోంది.

Updated : 12 Oct 2022 09:32 IST

వాట్సప్‌ వాడుతున్నారా? అయితే అది అసలైనదో, నకిలీదో ఓసారి చూసుకోండి. ఎందుకంటే ‘జీబీ వాట్సప్‌’ అనే వాట్సప్‌ క్లోన్‌ యాప్‌ మనదేశంలోని వాడకందార్లపై గూఢచర్యం చేస్తున్నట్టు ఈఎస్‌ఈటీ నివేదిక హెచ్చరిస్తోంది. ఈ థర్డ్‌ పార్టీ యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లో లేకపోయినప్పటికీ వివిధ వెబ్‌సైట్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవటానికి అందుబాటులో ఉంది. నిజం వాట్సప్‌ మాదిరిగానే జీబీ వాట్సప్‌లోనూ అన్ని ఫీచర్లు ఉంటాయి. ఇంకొన్ని అదనపు సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇది మాల్వేర్‌ ఫైళ్లతో ఫోన్‌ మీద నిఘా పెడుతుంది. ఆ విషయం వెంటనే మనకు తెలియదు కూడా. నెమ్మదిగా ఫోన్‌ రోజువారీ వ్యవహారాలను గమనిస్తూ వస్తుంది. ఇలాంటి అన్‌సపోర్టెడ్‌ యాప్‌లను వాడేవారి ఖాతాలపై వాట్సప్‌ తాత్కాలికంగా నిషేధం విధించింది. దీన్ని తొలగించాక అలాగే వాడితే శాశ్వతంగా వాట్సప్‌ వాడుకోకుండానూ నిషేధించనుంది. క్లోన్‌ వాట్సప్‌ కేసులు ఎక్కువగా మనదేశంతో పాటు ఈజిప్టు, బ్రెజిల్‌, పెరూలో వెలుగు చూస్తున్నాయి. మరి ఇలాంటి నకిలీ వాట్సప్‌ యాప్‌ల బారినపడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

* వాట్సప్‌ యాప్‌ను, అప్‌డేట్లను విధిగా గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. తెలియని థర్డ్‌ పార్టీ యాప్‌ల జోలికి వెళ్లొద్దు.

* వాట్సప్‌ అప్లికేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఓసారి తనిఖీ చేసుకోవాలి. ఇది హానికరంగా, నకిలీగా అనిపిస్తే వెంటనే అన్‌ఇన్‌స్టాల్‌ చేయాలి.

* ఫోన్‌లో సెక్యూరిటీ స్టేటస్‌ను చెక్‌ చేసుకోవాలి. అనధీకృత యాంటీవైరస్‌ ఏదైనా ఇన్‌స్టాల్‌ అయ్యిందేమో చూసుకోవాలి.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని