ఇన్‌స్టాలో హాయిగా..

అవాంఛిత, అసహ్యకర, కోపం కలిగించే వ్యాఖ్యలు, సందేశ వినతుల నుంచి తప్పించుకోవటానికి ఫొటో షేరింగ్‌ సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌ ఇటీవల కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.

Published : 02 Nov 2022 00:17 IST

అవాంఛిత, అసహ్యకర, కోపం కలిగించే వ్యాఖ్యలు, సందేశ వినతుల నుంచి తప్పించుకోవటానికి ఫొటో షేరింగ్‌ సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌ ఇటీవల కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. హిడెన్‌ వర్డ్స్‌ ఫీచర్‌తో పాటు బ్లాకింగ్‌ ఆప్షన్లనూ మెరుగుపరిచింది. హిడెన్‌ వర్డ్స్‌ ఫీచర్‌ ఆయా వ్యాఖ్యలు, మెసేజ్‌ రిక్వెస్ట్‌ల నుంచి హానికర అంశాలను దానంతటదే వడపోస్తుంది. దీన్ని ఎనేబుల్‌ చేసుకున్నవారికి మొత్తమ్మీద అసహ్యకర వ్యాఖ్యలు 40% వరకు తగ్గినట్టు ఇన్‌స్టాగ్రామ్‌ పేర్కొంటోంది.

హిడెన్‌ వర్డ్స్‌ జాబితాలో అనుచిత, అసహ్య, అమర్యాదకరంగా కనిపించే  పదాలు, పదబంధాలు, ఎమోజీల జాబితా ఉంటుంది. ఇది ఆయా పదాలతో కూడిన సందేశాలు కనిపించకుండా చేస్తుంది. మరి దీన్ని ఎనేబుల్‌ చేసుకోవటమెలా?

* ఆండ్రాయిడ్‌ లేదా ఐఓఎస్‌ పరికరంలో ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.

* ‘యువర్‌ ప్రొఫైల్‌’లోకి వెళ్లి కింద కుడివైపున ఉండే ప్రొఫైల్‌ పిక్చర్‌ మీద ట్యాప్‌ చేయాలి.

* పైన కుడివైపున కనిపించే మూడు చుక్కల గీతల మెనూను నొక్కాలి.

* సెటింగ్స్‌ ట్యాబ్‌లోకి వెళ్లి, ప్రైవసీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* అనంతరం హిడెన్‌ వర్డ్స్‌ ఆప్షన్‌ మీద ట్యాప్‌ చేయాలి.

* ‘అఫెన్సివ్‌ వర్డ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌’ విభాగం కింద ఉండే ‘హైడ్‌ కామెంట్స్‌, అడ్వాన్స్‌డ్‌ కామెంట్‌ ఫిల్టరింగ్‌, హైడ్‌ మెసేజ్‌ రిక్వెస్ట్స్‌’ ఆప్షన్లను ఆన్‌ చేసుకోవాలి.

ప్రత్యేక పదాల కోసమూ

హిడెన్‌ మెసేజ్‌లు ఎవరికీ కనిపించకపోయినప్పటికీ మొత్తం కామెంట్ల సంఖ్యకు తోడవుతూనే ఉంటాయి. మనం ఏవైనా పదాలతో కూడిన సందేశాలు వద్దనుకున్నా వాటిని కస్టమ్స్‌ వర్డ్స్‌ జాబితాలో చేర్చుకోవచ్చు. కావాలనుకుంటే దీన్ని ఎప్పుడైనా సవరించుకోవచ్చు. ఈ పదాలను ఎంచుకోవాలంటే..

* ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి, యువర్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌ మీద తాకాలి.

* పైన కుడివైపున ఉండే మూడు గీతల మెనూ ద్వారా సెటింగ్స్‌లోకి వెళ్లాలి.

* ప్రైవసీ విభాగం నుంచి హిడెన్‌ వర్డ్స్‌ ట్యాబ్‌ను ట్యాప్‌ చేయాలి.

* కస్టమ్‌ వర్డ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌ విభాగం కింద ఉండే మేనేజ్‌ కస్ట్‌మ్‌ వర్డ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌ బటన్‌ను నొక్కాలి.

* వేటితో కూడిన సందేశాలు వద్దనుకుంటే ఆయా పదాలు, పదబంధాలు, అంకెలు, ఎమోజీలను టెక్స్ట్‌ బాక్సులో ఎంటర్‌ చేయాలి.

* హిడెన్‌ కామెంట్స్‌, హైడ్‌ మెసేజ్‌ రిక్వెస్ట్‌ బటన్లను ఆన్‌ చేసుకోవాలి.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts