వాట్సప్ గోప్యత మరింత భద్రంగా..
వాట్సప్‌తో రోజువారీ సమాచార ప్రస్థానం తేలికైంది. ఇందులో ఛాట్ సందేశాలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయ్యింటాయి. అంటే మన వ్యక్తిగత, గ్రూప్ ఛాట్లను థర్డ్ పార్టీలెవరూ చూడలేరన్నమాట.
వాట్సప్‌తో రోజువారీ సమాచార ప్రస్థానం తేలికైంది. ఇందులో ఛాట్ సందేశాలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయ్యింటాయి. అంటే మన వ్యక్తిగత, గ్రూప్ ఛాట్లను థర్డ్ పార్టీలెవరూ చూడలేరన్నమాట. అంతెందుకు? వాట్సప్ బ్లాగ్ ప్రైవసీ పేజీని కూడా వాట్సప్ చదవలేదు. అయినా కూడా మనసులో ఏదో ఒకమూల గోప్యతకు భంగం కలుగుతుందేమోననే సందేహం మెదులుతూనే ఉంటుంది. కొన్ని చిట్కాలతో ఇలాంటి భయాలను తొలగించుకోవచ్చు.
ఆన్‌లైన్ విజిబిలిటీ పరిమితం
ఆన్‌లైన్ ఉన్నట్టు ఎవరెవరికి తెలియాలి? ఎవరికి తెలియకూడదు? అనేది సెట్ చేసుకోవటానికి వాట్సప్ వీలు కల్పించింది. దీన్ని మనమే నిర్ణయించుకోవచ్చు. ఇందుకోసం యాప్ సెటింగ్స్ ద్వారా ప్రైవసీ విభాగంలోకి వెళ్లాలి. ఆయా కాంటాక్టులను ఎంచుకోవటం ద్వారా మనం ఆన్‌లైన్‌లో ఉన్న విషయాన్ని ఎవరెవరు చూడొచ్చు, ఎవరు చూడరాదో అనేది సెట్ చేసుకోవచ్చు. దీంతో అనుమతించినవారికి మాత్రమే ఆన్‌లైన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది.
వ్యూ వన్స్ మెసేజెస్
మనం పంపిన ఫొటోలు, వీడియోలను అవతలివారు ఒకసారి మాత్రమే చూడటానికి వీలు కల్పించే ఫీచర్ ఇది. వాళ్లు దాన్ని ఓపెన్ చేసి చూశాక అవి వాటంతటవే డిలీట్ అవుతాయి. వాటిని రికవర్ కూడా చేసుకోలేం. అందువల్ల ఛాట్‌లో డిజిటల్ రికార్డులు శాశ్వతంగా ఉండవు. ఏదైనా రహస్య సమాచారాన్ని పంపించాల్సి వచ్చినప్పుడిది బాగా ఉపయోగపడుతుంది.
* వ్యూ వన్స్ మెసేజ్‌లను స్క్రీన్‌షాట్ తీయకుండా, రికార్డింగ్ చేయకుండా అడ్డుకునే ఫీచర్ సైతం త్వరలో అందుబాటులోకి రానుంది.
టూ-స్టెప్ వెరిఫికేషన్
ఛాట్స్ మరింత భద్రంగా ఉండటానికి పిన్ నంబర్ తోడ్పడుతుంది. ఛాట్స్‌కు పిన్ నంబరును సెట్ చేసుకుంటే ఫోన్‌ను ఎవరైనా అన్‌లాక్ చేసినా మన మెసేజ్‌లను చూడలేరు. పిన్‌ను సెట్ చేసుకోవటానికి ముందుగా సెటింగ్స్ ద్వారా అకౌంట్‌లోకి వెళ్లాలి. తర్వాత టూ-స్టెప్ వెరిఫికేషన్‌ను ఎంచుకొని ఎనేబుల్ చేసుకోవాలి. అనంతరం ఛాట్స్‌కు 6 అంకెల పిన్ నంబరును సెట్ చేసుకోవాలి. ఈమెయిల్ చిరునామాను జోడించుకోవటం మరవద్దు. ఒకవేళ ఎప్పుడైనా పిన్ నంబరును మరచిపోతే రికవర్ చేసుకోవటానికి, అవసరమైతే రీసెట్ చేసుకోవటానికిది అత్యవసరం.
డిలీట్/రిస్టోర్ మెసేజెస్
ఎవరికైనా, ఏ బృందానికైనా పొరపాటున మెసెజ్‌లు పంపిస్తే సవరించుకోవటానికీ వీలుంది. వాటిని వెంటనే డిలీట్ చేయొచ్చు. ఒకవేళ అనుకోకుండా ఏదైనా మెసేజ్‌ను డిలీట్ చేసినా, కొద్ది సెకండ్లలోపు దాన్ని అన్‌డూ చేసుకోవచ్చు. ఇలా మెసేజ్‌ను రిస్టోర్ చేసుకోవచ్చు. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్‌ను ఎంచుకుంటేనే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఎవరి వాట్సప్‌లోనైనా ఈ ఫీచర్ అందుబాటులో లేకపోతే మున్ముందు అప్‌డేట్స్‌తో యాడ్ అయ్యే అవకాశముంది.
మెసేజ్‌లు అదృశ్యం
ఏవైనా రహస్య విషయాలను సందేశాల రూపంలో పంపిస్తుంటే వాటిని నిర్ణీత కాలం తర్వాత అదృశ్యమయ్యేలా కూడా చూసుకోవచ్చు. మెసేజ్‌ను పంపించేటప్పుడు 24 గంటలు, ఏడు రోజులు, 90 రోజుల తర్వాత.. ఇలా అవి ఎప్పుడు డిలీట్ అవ్వాలో నిర్ణయించుకుంటే చాలు. వ్యవధి తీరగానే ఛాట్‌లోంచి వాటంతటవే తొలగిపోతాయి.
నిశ్శబ్దంగా గ్రూప్ నుంచి నిష్క్రమణ
అడ్మిన్‌కు తప్ప ఇతరులెవరికీ తెలియకుండా గ్రూప్‌లోంచి బయటకు వచ్చే మార్గమూ ఉంది. ముందుగా వైదొలగాలని అనుకుంటున్న ఛాట్ మీద కాసేపు అలాగే నొక్కి పట్టాలి. యాక్టివ్ ఛాట్ ఆప్షన్ (కింది బాణం గుర్తు బాక్స్) మీద ట్యాప్ చేస్తే అది ఆర్కైవ్‌లోకి వెళ్తుంది. అనంతరం ఛాట్స్‌ను పైకి స్క్రోల్ చేస్తూ వెళ్తే కింద ఆర్కైవ్డ్ విభాగం కనిపిస్తుంది. ఇందులో వైదొలగాలని భావిస్తున్న ఛాట్‌ను తెరచి, పైన కుడి మూలన నిలువు మూడు చుక్కల మెనూ ద్వారా మోర్ విభాగంలోకి వెళ్లాలి. అప్పుడు ఎగ్జిట్ గ్రూప్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిలోని ఎగ్జిట్ ఆప్షన్‌ను ఎంచుకుంటే చాలు. గుట్టు చప్పుడు కాకుండా గ్రూప్‌లోంచి బయటపడినట్టే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WT20 WC 2023: మహిళల టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా షెడ్యూల్ ఇదే
-
Crime News
Rajasthan: పెట్రోల్ ట్యాంకర్లో మద్యం అక్రమ రవాణా..!
-
World News
Australia: డాల్ఫిన్లతో ఈతకని దిగి.. సొర చేపకు చిక్కి..!
-
Sports News
Gill: ‘శుభ్‌మన్.. నాగ్‌పుర్ ఏదో చెబుతోంది చూడు’’: ఉమేశ్ యాదవ్ ఫన్నీ ట్వీట్
-
World News
Wikipedia: పాక్‌లో వికీపీడియాపై నిషేధం.. స్పందించిన వికీమీడియా
-
General News
Rushikonda: బోడికొండకు కవరింగ్.. జర్మన్ టెక్నాలజీతో జియో మ్యాటింగ్