ట్విటర్శాల!
సామాజిక మాధ్యమ వేదికల్లో ట్విటర్ ప్రత్యేకతే వేరు. సూటిగా, సుత్తి లేకుండా తక్కువ పదాలతోనే విషయాన్ని వివరించే పొట్టి సందేశాలతో అనతికాలంలోనే గొప్ప ప్రాచుర్యం పొందింది వీడియోలు, ఫొటోలతో సమాచారాన్ని పంచుకోవటం.. లింకులు షేర్ చేసుకోవటమూ కొత్త సొబగులు అద్దాయి.
సామాజిక మాధ్యమ వేదికల్లో ట్విటర్ ప్రత్యేకతే వేరు. సూటిగా, సుత్తి లేకుండా తక్కువ పదాలతోనే విషయాన్ని వివరించే పొట్టి సందేశాలతో అనతికాలంలోనే గొప్ప ప్రాచుర్యం పొందింది వీడియోలు, ఫొటోలతో సమాచారాన్ని పంచుకోవటం.. లింకులు షేర్ చేసుకోవటమూ కొత్త సొబగులు అద్దాయి. అందుకే సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ కట్టిపడేసే వేదికగా స్థిరపడిపోయింది. భావ వ్యక్తీకరణకే కాదు.. కంపెనీలు, చిన్న వ్యాపారులు, కంటెంట్‌ను సృష్టించేవారికీ ఎంతగానో ఉపయోగపడుతోంది. వ్యాపారాల ప్రచారం, అభివృద్ధికి తోడ్పడుతోంది. ట్విటర్‌ను వాడేవారికి దీని ఫీచర్ల గురించి బాగానే తెలుసు. కొత్తవారికి అంతగా పరిచయం ఉండకపోవచ్చు. వీటిని తెలుసుకుంటే ఇంకాస్త బాగా ట్విటర్‌ను ఉపయోగించుకోవచ్చు.
ట్విటర్ బ్లూ
ఇది ప్రీమియం సబ్స్క్రిప్షన్. దీన్ని పొందటానికి నెలవారీ చందా కట్టాలి. ప్రస్తుతానికి కొన్ని దేశాల్లోనే అందుబాటులో ఉంది. మనదేశంలోకి ఇంకా అనుమతించలేదు. దీన్ని పొందినవారికి 30 సెకండ్లలో ట్వీట్‌ను క్యాన్సిల్ చేసుకోవటం, పాత ట్వీట్లను సర్దుకోవటానికి ఫోల్డర్లను బుక్‌మార్క్ చేసుకోవటం, ట్వీట్లను మరింత స్పష్టంగా చదువుకోవటానికి రీడర్ మోడ్ వంటి అదనపు సదుపాయాలు కూడా లభిస్తాయి.
ఎడిట్ ట్వీట్
ఇటీవలే ప్రవేశపెట్టిన ఫీచర్ ఇది. కాకపోతే ట్విటర్ బ్లూ సభ్యులకే అందుబాటులో ఉంటుంది. ఇది ట్వీట్‌ను 30 నిమిషాల్లోపు సవరించుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఎడిట్ విషయంలో మిగతా సామాజిక మాధ్యమాలతో పోలిస్తే ఈ సమయం ఎక్కువే. ట్వీట్‌పై వచ్చే ప్రతిస్పందనలను బట్టి దానిపై వివరణ ఇచ్చుకోవటానికి, పదాల కూర్పును మార్చుకోవటానికి తగినంత సమయం చిక్కటానికిది వీలు కల్పిస్తుంది. తప్పుడు ఉద్దేశంతో ట్వీట్ వైరల్ కాకుండా అడ్డుకోవటానికి అవకాశముంటుంది. తప్పులను, వ్యాకరణ దోషాలను సవరించుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే పాత ట్వీట్లను సవరించు కోవటానికి మాత్రం వీలుండదు. ఇది తాజా ట్వీట్లకే వర్తిస్తుంది. ఎడిట్ చేసిన ట్వీట్ల మీద టైమ్ ముద్ర కూడా ఉంటుంది. ఒరిజినల్ ట్వీట్‌ను ఎప్పుడు ఎడిట్ చేశారో దీని ద్వారా తెలుస్తుంది.
వెరిఫికేషన్
ఇది యాక్టివ్, ప్రముఖమైన, అధికారిక ఖాతాలకు ట్విటర్ ఇచ్చే స్వీయ ధ్రువీకరణ. దీన్ని పొందిన ఖాతాలకు బ్లూ టిక్ రూపంలో గుర్తింపు లభిస్తుంది. ట్విటర్ బ్లూ చందాదారులకూ దీన్ని కల్పిస్తున్నారు. ట్విటర్ బ్లూ సబ్స్క్రయిబర్లకు ఒకసారి బ్లూ టిక్ ఇచ్చినట్టయితే వారి పేర్లను మార్చుకోవటానికి వీలుండదు. దీంతో నకిలీ ఖాతాల బెడద తగ్గుతుంది.
ట్విటర్ సబ్స్క్రిప్షన్స్
ప్రత్యేకమైన కంటెంట్‌ను సృష్టించేవారి కోసం ఉద్దేశించిన ఫీచర్ ఇది. తమ ట్వీట్లను అమ్ముకోవటానికిది వీలు కల్పిస్తుంది. ట్విటర్లో మిమ్మల్ని అనుసరించేవారు ఫీజు కడితేనే ఆయా ట్వీట్లను చూడటానికి అవకాశం లభిస్తుంది. ఆయా ట్వీట్లకు సంబంధించిన నోటిఫికేషన్లు వెంటనే అందుతాయి కూడా. ప్రొఫైల్ మీదుండే సబ్స్క్రయిబ్ బటన్ ద్వారా దీని సేవలను పొందొచ్చు.
ట్విటర్ సర్కిల్స్
ఆయా ట్వీట్లను ఎవరెవరు చూడొచ్చనేది ఎంచుకోవటానికిది తోడ్పడుతుంది. ఎంపిక చేసుకున్న అనుచరులతో ఇంకాస్త సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవటానికి, ఆత్మీయంగా చర్చించుకోవటానికిది దోహదం చేస్తుంది. ఒకరకంగా దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లోని క్లోజ్ ఫ్రెండ్స్ ఫీచర్ అనుకోవచ్చు. దీంతో మన సర్కిల్లో 150 మందిని చేర్చుకోవచ్చు. దీని ద్వారా ఆయా వ్యక్తులకే ట్వీట్లను పంపుకోవటం సాధ్యమవుతుంది.
ట్విటర్ కమ్యూనిటీస్
ఒకరకంగా దీన్ని రచ్చబండ అనుకోవచ్చు. ఒకేరకమైన ఆసక్తులు గలవారు ఒక చోట చేరి, ఆయా అంశాలపై ముచ్చటించుకోవచ్చు. చర్చను ఆరంభించి ఆయా వ్యక్తులను దీనిలోకి ఆహ్వానించొచ్చు. ఆతిథ్యమిచ్చేవారు స్పీకర్లను మాట్లాడటానికి అవకాశం కల్పిస్తారు. చర్చలను రికార్డు చేసుకోవచ్చు కూడా.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Beating Retreat: సైనిక విన్యాసాలు భళా.. 3,500 డ్రోన్లతో మెగా షో.. వీక్షించండి
-
Sports News
Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023.. జకోవిచ్ ఖాతాలో పదో టైటిల్.. మొత్తంగా 22వ గ్రాండ్‌స్లామ్
-
General News
Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
General News
Srisailam: శ్రీశైలం ఘాట్రోడ్లో రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Chiranjeevi: జన్మజన్మలకు నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాం..: చిరంజీవి